తెలుగు స్టార్ హీరో అక్కినేని నాగార్జున ఇంట తీవ్ర విషాదం నెలకొంది.. దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు కూతురు, నాగార్జున సోదరి నాగ సరోజ అనారోగ్యం తో గత కొన్ని రోజులుగా భాధపడుతూ కన్నుమూసింది. ఈ విషయం కాస్త ఆల్యంగా వెలుగులోకి వచ్చింది.. ఆమె కొన్నిరోజులుగా ఆసుపత్రిలో చికిత్సను తీసుకుంటున్నారు.. వైద్యానికి సహకరించక పోవడంతో తుది శ్వాస విడిచారని తెలుస్తుంది..
అయితే నాగ సరోజ మంగళవారం నాడు కన్నుమూశారు.. అయితే ఈ విషయం బయటకు రాలేదని తెలుస్తుంది.. ఇకపోతే సర్గీయ నటుడు నాగేశ్వరావు కు ఐదుగురు సంతానం.. సత్యవతి, నాగ సుశీల, నాగ సరోజ, వెంకట్, నాగార్జున ఇలా ఐదుగురు అన్న విషయం తెలిసిందే.. అందులో నాగేశ్వరావు మొదటి బిడ్డ సత్యవతి ఎప్పుడో కన్ను మూశారు.. నాగార్జున ఇద్దరు అక్కలను పోగొట్టుకున్న బాధలో ఉన్నారు.. ఇది అక్కినేని కుటుంబానికి తీవ్ర బాధను మిగిల్చింది..
నాగ సరోజ అనారోగ్యంతో నిన్న స్వర్గస్తులయ్యారు. ఈమె మొదటి నుంచి సినిమా ఇండస్ట్రీకి దూరంగానే ఉంది. సినిమా రిలీజ్ ఫంక్షన్‌లో కానీ, బయట ఏ ఇతర ఫంక్షన్‌లోనూ పెద్దగా కనిపించలేదు. స్టార్ హీరో కూతురు అయినప్పటికీ చాలా సింపుల్‌గా జీవితాన్ని గడిపేసింది. చివరి వరకు అలాగే ఉండిపోయింది. అందుకే తన మరణవార్త సైతం అందుకే బయటకు రాలేదు.. దీంతో ఈ వార్త బయటకు రాలేదు.. ఆమె అంత్యక్రియలను ఘనంగా నిర్వహించినట్లు తెలుస్తుంది.. =