CM KCR: బీఆర్ఎస్ నేతలతో కలిసి దాబాలో చాయ్ తాగిన సీఎం కేసీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు మరి కొన్ని రోజుల సమయం మాత్రమే ఉండటంతో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రచారంలో స్పీడ్ పెంచారు. ఇటీవల అనారోగ్యం కారణంగా దాదాపు 20 రోజులు విశ్రాంతి తీసుకుని.. ఇప్పుడు కోలుకున్న తర్వాత ఎన్నికల ప్రచారంలో వేగం పెంచారు. అన్ని పార్టీల కంటే ముందే ఒకేసారి 115 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన గులాబీ బాస్.. ప్రచారంలోనూ అదే దూకుడుతో ముందుకు సాగుతున్నారు.
Read Also: National Award Winners: ఇది రా టాలీవుడ్ అంటే.. ఈ ఒక్క ఫోటో చరిత్రలో నిలిచిపోతుంది
Also Read
- Pawan Kalyan Fan: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పెను విషాదం.. కరెంట్ షాక్‌తో అభిమాని మృతి!
- AICC Disciplinary Action: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు.? నేడు ఏఐసీసీ కీలక నిర్ణయం
- 8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్‌ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
- Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
అయితే, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఇంకా అభ్యర్థుల వేటలో ఉండగానే.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. రోజుకు రెండు మూడు చోట్ల బీఆర్ఎస్ నిర్వహించే బహిరంగా సభల్లో పాల్గొంటున్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ప్రచారంలో భాగంగా కేసీఆర్ ఇవాళ మొదటగా సిరిసిల్లలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు ఆయన హాజరయ్యారు. ఇక, ఈ సభ అనంతరం సిద్దిపేటలో తల పెట్టిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.
Read Also: Leo: లియో టైటిల్ సెటిల్ మెంట్.. ఎన్ని లక్షలు ఇచ్చారంటే.. ?
ఇక, సీఎం కేసీఆర్ సిద్దిపేటలో నిర్వహించిన బహిరంగ సభ ముగిసిన అనంతరం తిరిగి హైదరాబాద్ కు బయలు దేరారు. అయితే, సిద్దిపేట నుంచి తిరుగు ప్రయాణమైన కేసీఆర్ మార్గ మధ్యంలో ‘సోనీ ఫ్యామిలీ దాబా’లో కాసేపు ఆగారు. బీఆర్ఎస్ నేతలతో కలిసి దాబాలో కేసీఆర్ చాయ్ తాగుతు కనిపించారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రి హరీశ్ రావు, ఎంపీ దామోదర్ రావు, ఎంపీ, దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనా చారి, ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితర బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. వీరందరూ ఆ దాబాలో టీ తాగుతూ.. కాసేపు మాట్లాడుకున్నారు. అనంతరం, హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. అయితే, సీఎం కేసీఆర్ ధాబాలో చాయ్ తాగే ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
BCCI Selection Rule: బీసీసీఐ కీలక మార్పు.. ఇకపై 100 కాదు 200 శాతం.. టీమిండియా ఆటగాళ్లకు చుక్కలే!
-
Mirzapur: The Movie: రిలీజ్‌కు ముందే కోట్లు కొల్లగొట్టిన కలీన్ భయ్యా.. మొదటి రోజే అదిరిపోయిన అడ్వాన్స్ బుకింగ్స్!
-
Hamas Crypto Funding: హమాస్‌కు చావుదెబ్బ.. క్రిప్టో నెట్‌వర్క్‌పై FBI మెరుపుదాడి.. రూ. కోట్లలో నిధులు సీజ్!
-
418 Movie: ప్రశాంత్ నీల్ ‘418’కు సెన్సార్ షాక్.. భయపెట్టే సీన్లపైనే అభ్యంతరాలు!
-
Pawan Kalyan Fan: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పెను విషాదం.. కరెంట్ షాక్‌తో అభిమాని మృతి!
ట్రెండింగ్
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్‌ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!