Leo: లియో.. లియో.. లియో .. ప్రస్తుతం సోషల్ మీడియాను ఈ సినిమ షేక్ చేస్తోంది. ఏంటి..సినిమా హిట్ అని టాక్ నడుస్తుందా.. ? అందుకే షేక్ చేస్తుందా.. ? అంటే .. అది కాదండి. కొన్నిరోజులుగా లియో కోర్టు చిక్కుల్లో ఉన్న విషయం తెల్సిందే. లియో తెలుగు టైటిల్ వివాదం అందరికి తెల్సిందే. ఈ విషయమై నేడు తెలుగులో లియోను రిలీజ్ చేస్తున్న నాగవంశీ క్లారిటీ ఇచ్చాడు. ” తెలుగులో టైటిల్ విషయంలో చిన్న సమస్య వచ్చింది. తెలుగులో లియో టైటిల్ ని ఒకరు రిజిస్టర్ చేసుకున్నారు. వారు మమ్మల్ని సంప్రదించకుండా నేరుగా కోర్టుని ఆశ్రయించారు. ఈ విషయం నాకు కూడా మీడియా ద్వారానే తెలిసింది. టైటిల్ రిజిస్టర్ చేసుకున్నవారితో మాట్లాడుతున్నాం. సమస్య పరిస్కారం అవుతుంది. విడుదలలో ఎలాంటి మార్పు ఉండదు. అక్టోబర్ 19నే తెలుగులో కూడా లియో విడుదల అవుతుంది” అని చెప్పుకొచ్చాడు.
Renu Desai: నేను రెండో పెళ్లి చేసుకుంటాను.. అతను నేను సుఖంగా ఉంటే చాలు అన్నాడు
ఇక అందుతున్న సమాచారం ప్రకారం.. లియో మేకర్స్.. సదురు కేసు పెట్టినవారితో ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. వారికి రూ. 25 లక్షలు ఇచ్చి ఈ వివాదాన్ని ముగించినట్లు సమాచారం. అయితే ఆ డబ్బులు తెలుగు రైట్స్ దక్కించుకున్న నాగవంశీ ఇచ్చాడా.. ? లేక తమిళ్ మేకర్స్ ఇచ్చారా..? అనేది తెలియాల్సి ఉంది. ఏదిఏమైనా డబ్బులు సెటిల్ చేసి.. సినిమా రిలీజ్ కు ముందే ఈ వివాదాన్ని క్లోజ్ చేయడం తెలివైన పని అని కొందరు చెప్పుకొస్తున్నారు. మరి ఇంత రిస్క్ చేసి.. రిలీజ్ చేస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.