ఇంటెల్ కంపెనీ.. తన ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఎంప్లాయిస్‌కు ఉచిత పానీయాలు తిరిగి ఇస్తున్నట్లు వెల్లడించింది. ఉద్యోగులను ఉత్సాహపరిచేందుకు ఈ చర్య తీసుకున్నట్లు స్పష్టం చేసింది.
మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో విషాదం చోటు చేసుకుంది. గోరఖ్‌పూర్ నుంచి పూణే వెళ్తున్న పూణె వీక్లీ ఎక్స్‌ప్రెస్ జనరల్ కోచ్‌లోని ప్రయాణికులపై వేడి వేడి 'టీ' పడటంతో గందరగోళం నెలకొంది. ముగ్గురు ప్రయాణీకులపై టీ పడటంతో.. వారు ప్రయాణించే కోచ్ అల్లకల్లోలం అయింది. తమపై 'టీ' పడటంతో చాలా ఇబ్బందిగా, నొప్పిగి ఉందంటూ.. కోచ్ లో నెట్టడం, లాగడం చేశారు. ఈ గందరగోళంలో డోర్ వద్ద కూర్చున్న ఇద్దరు ప్రయాణికులకు తగలడంతో కదులుతున్న రైలు నుండి జారి పడిపోయారు
బీహార్‌లోని భోజ్‌పూర్‌లో విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. భర్త టీ చేయమని భార్యను కోరగా ఆమె నిరాకరించింది. దీంతో కోపంతో భర్త విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
దేశంలో టీ ప్రియులకు కొరత లేదు. అలసట నుంచి ఉపసమనం పొందేందుకు కొందరు టీ తాగుతుంటారు. అందుకే గ్రీన్ టీ, బ్లాక్ టీ, మిల్క్ టీ, చమేలీ టీ వంటి రకరకాల టీలు మార్కెట్ లో సందడి చేస్తున్నాయి.
'టీ' అంటే తాగని వారు ఎవరూ ఉండరు. తలనొప్పి ఉన్నా.. పనిలో ఒత్తిడి నుంచి రిలీఫ్ పొందాలన్నా టీ తాగాల్సిందే. మరీ ముఖ్యంగా ఉదయం లేవగానే ఛాయ్ లేకపోతే.. ఆ రోజంతా తలనొప్పిగా ఉంటుంది. అందుకోసమని వేడి వేడిగా ఒక గ్లాస్ ఛాయ్ తాగితే ఉపశమనం కలిగిస్తుంది. తమ రుచి మరియు ఆరోగ్యాన్ని బట్టి.. గ్రీన్ టీ, బ్లాక్ టీ, లెమన్ టీ, మిల్క్ టీలను తాగుతుంటారు. వీటిలో మిల్క్ టీ అంటే చాలా మందికి ఇష్టం.…
Tea vs Coffee: టీ ( TEA) లేదా కాఫీ (Coffee).. ఈ రెండిటిని చాలామంది ఆస్వాదించి తాగే వాళ్ళు ఎందరో. అయితే చాలామంది టీ తాగడానికి ఇష్టపడుతుండగా.. మరి కొంతమంది కాఫీ తాగడానికి ఇష్టపడుతుంటారు. అయితే ఈ రెండింటిలో ఏది తాగడం వల్ల మన శరీరానికి ఆరోగ్యంగా పనిచేస్తుందని విషయానికి ఎప్పటికప్పుడు పలు అధ్యయనాలు తెరమీదకి వస్తూనే ఉంటాయి. ఇకపోతే అసలు మన శరీర సంబంధించి ఏది తాగాలో ఒకసారి చూద్దామా.. టీ.. ఓ ఆరోగ్యకరమైన…
పెళ్లికూతురు ఇంట్లో భోజనాలు సరిగా పెట్టలేదని.. మాంసం వడ్డించలేదని.. మర్యాద సరిగా చేయలేదని గొడవలు జరుగుతుంటాయి. కానీ, టీ పోయలేదని ఇరువర్గాలు గొడవ పడ్డ ఘటన ఖమ్మంలో జరిగింది. ఖమ్మం ప్రకాష్ నగర్ కు చెందిన యువతికి చెరువుబజార్ కు చెందిన యువకుడితో పెళ్లి కుదిరింది. దీంతో పెళ్లి కూతురి ఇంటి వద్ద పూజలకు పెళ్లి కొడుకు తరపు బంధువులు వెళ్లారు.
రోజూ టీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది.. ఉదయం లేవగానే వేడి వేడిగా టీ, కాఫీ తాగకుంటే చాలామందికి ఏదోలా ఉంటుంది.. అందులో ఇప్పుడు చలికాలం.. ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు.. అలా పొద్దున్నే టీ, కాఫీ కోసం పరుగేడుతున్నారు.. కాస్త వేడిగా గొంతులోకి దిగితే బాడిలో వేడి పెరుగుతుందని అందరు నమ్ముతారు.. అయితే టీని ఒక్కసారి తాగితే మంచిదని, అంతకన్నా ఎక్కువ సార్లు తాగితే ప్రమాదంలో పడతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. ఎటువంటి అనారోగ్య సమస్యలు…
అమెరికా- బ్రిటన్ దేశాల మధ్య ఈ టీ వల్ల వివాదం చెలరేగింది. యూఎస్ కు చెందిన ఓ ప్రొఫెసర్ టీ ఎలా తయారు చేయాలో చెబుతూ చేసిన సూచన బ్రిటన్ వాసులను తీవ్ర అసంతృప్తికి గురి చేసింది.
చలికాలం వచ్చిందంటే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి.. ఎంతగా జాగ్రత్తలు తీసుకున్నా సరే ఏదోక సమస్య మనల్ని వెంటాడుతుంది.. సీజనల్ వ్యాదులతో కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకోసమే చలికాలంలో ఆహారం, ఆరోగ్యం అలాగే జీవనశైలి విషయంలో కొన్ని రకాల మార్పులు తప్పనిసరి. ఇకపోతే చాలామంది చలికాలం ఎక్కువగా వేడి వేడి పదార్థాలను తాగడానికి తినడానికి ఇష్టపడుతూ ఉంటారు.. జామ ఆకు టీని తీసుకోవడం వల్ల అనేక సమస్యలు తగ్గిపోతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..…