National Award Winners: ఒకప్పుడు ఉన్న టాలీవుడ్ వేరు.. ఇప్పుడు ఉన్న టాలీవుడ్ వేరు. ఒకప్పుడు తెలుగు హీరోలు.. ఒక పెద్ద అవార్డు ఫంక్షన్ కు వెళ్తే.. కనీసం స్టేజిమీదకు వచ్చి మాట్లాడేవారు కాదు. ఒక్క తెలుగు హీరో ఫోటో ఉండేది కాదు. జనరేషన్ మారే కొద్దీ .. టాలీవుడ్ ఎన్నో మార్పులు వచ్చాయి. టాలీవుడ్ అంచంచలంచలుగా పైకి ఎదిగింది. దేశం కాదు.. ప్రపంచం మొత్తం తెలుగు పరిశ్రమను గుర్తిస్తోంది. ఇక అందుకు నిదర్శనం.. ఈ ఏడాది నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ అని చెప్పాలి. నేషనల్ అవార్డ్స్ ఇవ్వడం మొదలుపెట్టి 69 ఏళ్లు అవుతుంది. ఇప్పటివరకు ఉత్తమ నటుడు కేటగిరిలో ఒక్క హీరో కూడా ఎంపిక కాలేదు. కానీ, ఈ ఏడాది మొట్ట మొదటసారి అల్లు అర్జున్ ఆ ఘనతను సాధించాడు.నేడు ఢిల్లీలో జాతీయ అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. 2021కి గాను ఉత్తమ చిత్రాలు, నటులు, సాంకేతికనిపుణులను ఎంపిక చేసినవారికీ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అవార్డులను అందజేశారు.
Leo: లియో టైటిల్ సెటిల్ మెంట్.. ఎన్ని లక్షలు ఇచ్చారంటే.. ?
ఇక ఈసారి టాలీవుడ్ తమ సత్తా చాటింది. అన్ని విభాగాల్లో తెలుగు వారు తామేంటో నిరూపించుకున్నారు. ఇక ఈ వేడుకలో పాల్గొన్న విజేతలు అందరు ఒక్క ఫ్రేమ్ లో కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. 69 వ జాతీయ అవార్డు విజేతలు అందరు సింగిల్ ఫ్రేమ్ లో కనిపించి కనువిందు చేశారు. రాజమౌళి, అల్లు అర్జున్, దేవి శ్రీ ప్రసాద్, బుచ్చిబాబు సాన, కాళ భైరవ, మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు.. ఇలా మొత్తం ఈ ఫొటోలో కనిపించడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇక ఈ ఫోటోను చూసి అభిమానులు.. ఇది రా టాలీవుడ్ అంటే.. ఈ ఒక్క ఫోటో చరిత్రలో నిలిచిపోతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.