గద్వాల్ జిల్లాలో నేడు సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. గద్వాల్ జిల్లాకు చేరుకున్న సీఎం కేసీఆర్.. జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించారు. అంతేకాకుండా.. జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు.
Also Read : TS EDCET 2023 : విద్యార్థులకు అలర్ట్.. ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల.. లింక్
అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పండితుల వేద మంత్రోచ్ఛరణల మధ్య శిలాఫలకాన్ని ఆవిష్కరించి, రిబ్బన్ కట్ చేసి పార్టీ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో.. మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. అనంతరం అయిజ రోడ్డులో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
Also Read : Durgam Chinnaiah : బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై సీబీఐకి ఫిర్యాదు