ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఓ ఇద్దరు కరటక దమనకలు ఉన్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు నేతలను ఉద్దేశించి కరటక దమనకులు అంటూ రెండు సార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఆ ఇద్దరు నేతలను వర్ణించడానికి ఇలా ఒక్కపదాన్ని కేసీఆర్ వాడారు. ఖమ్మంజిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆశీర్వాద సభలను నిర్వహించారు. ఈసభ లో ముఖ్యమంత్రి మాట్లాడుతు జిల్లాకు సంబందించిన ఇద్దరు నేతలనుద్దేశించి చేసిన వ్యాఖ్య చర్చనీయాంశంగా మారింది. అయితే వారిద్దరి పేర్లను కేసీఆర్ నోటి నుంచి వెలువడక పోయినప్పటికి ఆ ఇద్దరు నేతలు మాత్రం మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి లు.. వారిద్దరినిఉద్దేశించి కేసీఆర్ చేసిన కరటక దమనులు అంటూ చేసిన వ్యాఖ్యలు ఎవ్వరికి అర్దం కాలేదు. అలా ఎందుకు మాట్లాడారో తెలయిదు.. అయితే కేసీఆర్ మాత్రం మాట మరాటీ అనేది అందరికి తెలిసిందే.. ఎప్పుడు ప్రత్యర్ధులను తిట్ల దండకంలో ముందు ఉంటారు. అయితే ప్రస్ మీట్ ల వద్ద నుంచి, బహిరంగ సభ వేదిక ల మీద తిట్ల దండకలంలో కేసీఆర్‌ను మించిన వారు ఎవ్వరు ఉండరు అయితే.. ఈరోజు కల్లూరు సభలో వాడిన పధం మాత్రం ఎవ్వరికి అర్ధం కాని తిట్టుగా ఉంది.
కేసీఆర్ పుస్తకాలు చదువడంలో ప్రసిద్ది చెందిన వ్యక్తిగా అందరికి తెలుసు అందువల్లనే కేసీఆర్ తిట్టే తిట్ల కు కూడ ఒక్క అర్దం ఉంటుందని అందరికి తెలిసిందే.. సాహిత్యం దిట్ట అయిన కేసీఆర్ చేసే వ్యాఖ్యలకు అంత ప్రసిద్ది… ఇప్పుడు కూడ తుమ్మల, పొంగులేటి లను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు కూడ అటువంటివే… ఇప్పుడు ఆ అర్ధం ఏమిటో ఒక్క సారి పరిశీలిస్తే… పరవస్తు చిన్నయ్య సూరి కధల రచయిత. చిన్న పిల్లల కథలు బాగా రాసేవారు. ఆయన కథలు పాఠ్య పుస్తకాల్లో ఉండేవి. ఇవి అన్ని నీతి కథలు కూడ. ఇప్పుడు ఆ చిన్నయ్య సూరి కథలను ఇప్పుడు నేర్చుకోవలసి వస్తుందేమో రాజకీయ నాయకులు.. తుమ్మల, పొంగులేటి పేర్లను ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు ఇవి.. చిన్నయ్య సూరి కధలో కరటకుడు, దమనకుడు పాత్రలు.. ఈ రెండు నక్కలు మోసం చేసే నక్కలు గా ఆ కథలలో ఉంటుంది.. ఆ రెండు నక్కలు తెలివి గా ఉంటు, ఎదుటి వారిని మోసం చేయడంలో దిట్ట గా ఉంటాయి. నటించడంలో అద్బుతంగా ఉంటూ ఎదుటి వారిని మోసం చేస్తుంటాయి.. ఆ కథలలో.. అటువంటి ఆ నక్కలను తుమ్మల, పొంగులేటి లను వర్ణిస్తు కెసిఆర్ మాట్లాడారు. ఎంతైన కెసిఆర్ మాటల మరాఠీ.. ఆయనను ఎదుర్కోవడం ఎవ్వరికి సాద్యం కాదేమో..