ఎన్నికల సమరానికి బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమైంది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన పార్టీ అధినేత కేసీఆర్.. తెలంగాణ భవన్‌లో మ్యానిఫెస్టోను విడుదల చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే వచ్చే ఐదేండ్లలో ప్రజల సంక్షేమం, అభివృద్ధికి బీఆర్‌ఎస్ ఏం చేయబోతున్నదన్న పూర్తి ప్రణాళికను ఆయన వివరించారు. హామీలను చెప్పడమే కాకుండా, వాటి అమలుకు తమ దగ్గర ఉన్న వనరులు, అమలు విధానాలను కూడా సీఎం కేసీఆర్ ప్రజలకు వెల్లడించారు. ప్రజల అవసరాలు తీర్చేలా, రాష్ట్ర ప్రగతికి ఉపయోగపడేలా మ్యానిఫెస్టో తీర్చిదిద్దిన్నట్టు తెలిపారు.
Read Also: Afghanistan Earthquake: అఫ్గానిస్థాన్‌లో మరోసారి భారీ భూకంపం.. 1,000 మందికి పైగా మృతి!
ఇప్పటికి రెండుసార్లు విజయం సాధించిన బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తుందని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో విజయవంతంగా అమలు అవుతున్న పథకాలను బేరీజు వేసుకుని అమలు సాధ్యమయ్యే పథకాలను తీసుకొచ్చారు.. కేసీఆర్ తన మార్క్ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. మొదటి సారి పూర్తిగా సంక్షేమ అజెండా తెలంగాణ పునర్‌నిర్మాణం పేరుతో అధికారం చేపట్టిన కేసీఆర్, రెండోసారి అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను వెల్లడించారు. ఇప్పుడు మూడోసారి అదే పంథాతో ముందుకు సాగుతున్నారు.
Read Also: Bhagavanth Kesari: మీడియా ముందుకి బాలయ్య అండ్ భగవంత్ కేసరి టీమ్
రెండు దఫాలుగా చెప్పిన దాని కంటే ఎక్కువగా అమలు చేశామని సీఎం కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పినవి కూడా చేశామని కేసీఆర్ తెలిపారు. కళ్యాణి లక్ష్మి, విదేశీ విద్య ఎక్కడా ప్రకటించకపోయినా అమలు చేశాం.. దాదాపు 99.9 శాతం ఎన్నికల ప్రణాళికలను అమలు చేసేశాం.. రాష్ట్రంలో దళితులకు దళిత బంధు ప్రకటించాం.. 1. రేషన్ కార్డు దారులకు సన్న బియ్యం.. 2. ప్రజలందరికీ లక్ష కేసీఆర్ బీమా పథకం, 3. నెల పింఛన్ల ఐదు వేలకు పెంపు, 4. దళిత బంధు, 5. ముస్లిం బడ్జెట్ పెంపు చేస్తున్నాట్లు బడ్జెట్ లో ప్రకటించారు.
Read Also: AAI ATC Jobs : ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లో 456 ఉద్యోగాలు..
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీకి చెందిన మొత్తం 51 మంది అభ్యర్థులకు బీ-ఫామ్స్ అందజేశారు. కాగా.. బీఫామ్‌తోపాటు ఒక్కో అభ్యర్థికి రూ.40 లక్షల చెక్కును కేసీఆర్ అందజేశారు. ఈరోజు బీ ఫామ్స్ అందని అభ్యర్థులు రేపు ప్రగతి భవన్‌కు వచ్చి తీసుకోవాలని ఆయన సూచించారు. అన్ని బీఫామ్స్‌పై సంతకాలు చేయడం ఆలస్యమైంది.. బీ-ఫామ్స్ రానీ వారు ఆందోళన చెందుద్దని కేసీఆర్ సూచించారు. ఈసారి ఎన్నికల్లో పోటీ హోరాహోరీ ఉంటుందని సర్వేలు చెబుతున్న టైంలో కేసీఆర్ మరోసారి సంక్షేమ మేనిఫెస్టోను ఓటర్ల ముందుకు తీసుకు వెళ్లారు.