Kalki2898AD: సలార్ సినిమా తరువాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో కల్కి2898AD ఒకటి. మహానటి చిత్రంతో ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. వైజయంతీ బ్యానర్ పై అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో లోక నాయకుడు కమల్ హాసన్ విలన్ గా కనిపిస్తుండగా.. దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. మే 9 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతోంది కానీ.. సినిమా నుంచి అప్డేట్స్ మాత్రం మేకర్స్ అందించడం లేదు. మొన్నటివరకు ప్రభాస్.. విదేశాల్లో ఉన్నాడని, వచ్చాకా షూటింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పుకొచ్చారు.
ఇవన్నీ కాదు.. కనీసం షూటింగ్ అప్డేట్స్ అయినా ఇవ్వండి అని అభిమానులు ఫైర్ అవుతున్న నేపథ్యంలో ఎట్టకేలకు ప్రభాస్ ఫ్యాన్స్ కు సడన్ సర్ ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. ఇండియాలో కీలక షెడ్యూల్స్ ను పూర్తిచేసుకున్న చిత్ర బృందం తాజాగా ఇటలీకి బయల్దేరుతున్నట్లు తెలిపారు. ఇటలీలో సాంగ్ షూటింగ్ జరగనుందని చెప్పుకొచ్చారు. ఇటలీలో ఆటాపాటా అంటూ.. చిత్ర బృందం మొత్తం ఇటలీకి బయల్దేరుతున్నప్పుడు దిగిన ఫోటోను షేర్ చేశారు. ఇక ఆటాపాటా అంటున్నారు.. దీపికా మాత్రం లేదేంటి.. అనుకుంటున్నారా.. దీపికా లేకపోతేనే దిశా ఉందిగా. ఆమెతోనే సాంగ్ షూట్ జరుగుతుందని మేకర్స్ చెప్పకనే చెప్పుకొచ్చారు. ప్రభాస్, నాగ్ అశ్విన్, దిశా తో పాటు మిగతా టెక్నీషియన్స్ అందరూ కూడా ఈ ఫొటోలో కనిపించారు. ఇక దీంతో ప్రభాస్ అభిమానులు సంతోషిస్తున్నారు. మరి ఈ సినిమాతో ప్రభాస్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.