Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Cm Chandrababu Warns Tdp Leaders Over Misconduct Ahead Of Local Elections

Chandrababu warning: పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్.. తప్పులు చేస్తే హెడ్‌లైన్స్‌లోకి వెళ్తారు అంటూ హెచ్చరిక

Published Date :April 29, 2026 , 11:42 am
By Sudhakar Ravula
Chandrababu warning: పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్.. తప్పులు చేస్తే హెడ్‌లైన్స్‌లోకి వెళ్తారు అంటూ హెచ్చరిక
  • Follow Us :
  • google news
  • dailyhunt

Chandrababu warning: తెలుగుదేశం పార్టీ నూతన కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పార్టీ నేతలకు ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కీలక సూచనలు చేశారు. గతంతో పోలిస్తే ఈసారి మరింత కఠినంగా మాట్లాడిన చంద్రబాబు, పార్టీ ప్రతిష్ట దెబ్బతినేలా ఎవ్వరూ ప్రవర్తించొద్దని హెచ్చరించారు. తప్పులు చేస్తే నేరుగా హెడ్‌లైన్స్‌లోకి వెళ్తారని, అలాంటి పరిస్థితులు రానీయకుండా జాగ్రత్తగా ఉండాలని నేతలకు సూచించారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రతి నాయకుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఇష్టం వచ్చినట్టు పని చేసి పార్టీకి చెడ్డపేరు తేవద్దని గట్టిగా చెప్పారు.

నాలుగు దశాబ్దాలుగా పార్టీ కమిటీలపై కసరత్తు చేస్తున్నానని, అయితే ఈ స్థాయిలో సమగ్రంగా పరిశీలించి కమిటీలు ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి అని చంద్రబాబు తెలిపారు. ఎన్నో వడపోతలు, వ్యూహాలతో నూతన కమిటీలను రూపొందించామని చెప్పారు చంద్రబాబు.. సీనియర్లకు గౌరవం ఇస్తూనే కొత్తవారికి అవకాశాలు కల్పించామని, కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఇచ్చామని వెల్లడించారు. కార్యకర్తే అధినేత అనే నినాదాన్ని మాటల్లో కాకుండా ఆచరణలో చూపిస్తున్నామని అన్నారు. మహిళలకు అధిక ప్రాధాన్యం ఇచ్చామని, మహిళా బిల్లుకు పూర్తిగా మద్దతు తెలిపామని చెప్పారు. చదువుకున్న వారికి మంత్రి పదవులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. ఓ మండల పార్టీ అధ్యక్షురాలికి, క్లస్టర్ ఇన్‌చార్జికి పొలిట్‌బ్యూరోలో స్థానం కల్పించడం ఇందుకు నిదర్శనమని అన్నారు.

Also Read

  • Chandrababu: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది.. కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారు.. ఎవ్వరికీ తలవంచరు..
  • TDP నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం.. చంద్రబాబు ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం
  • AP SSC Results 2026: రేపే ఏపీ టెన్త్‌ ఫలితాలు.. ఇలా కూడా చెక్‌ చేసుకోవచ్చు..
  • Janasena Party: కర్ణాటకలో జనసేన విస్తరణకు శ్రీకారం.. పార్టీలో భారీగా చేరికలు

ఇక, నారా లోకేష్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కీలక పాత్ర పోషించారని చంద్రబాబు కొనియాడారు. కార్యకర్తల శిక్షణ, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించారని తెలిపారు. రాష్ట్రానికి 20 లక్షల ఉద్యోగాలు తీసుకురావాలనే లక్ష్యంతో లోకేష్ కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీ బలం పెరగాలని, గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లకంటే ఎక్కువ ఓట్లు సాధించాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలు గతంలో ఎదుర్కొన్న కష్టాలు తనకు గుర్తున్నాయని, వారి కష్టఫలితంగానే పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చిందని అన్నారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ కేంద్ర సహకారంతో ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. నిలిచిపోయిన కేంద్ర పథకాలను పునరుద్ధరించామని, అప్పులను రీషెడ్యూల్ చేస్తున్నామని చెప్పారు. సూపర్ సిక్స్ హామీల అమలు, పెన్షన్ల పంపిణీ, ప్రజలకు వాట్సాప్ సేవలు అందిస్తున్నామని వివరించారు. ప్రత్యర్థి పార్టీలపై కూడా చంద్రబాబు విమర్శలు గుప్పించారు. అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని నాశనం చేశారని, ఇప్పుడు కూడా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అయితే ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ఫేక్ ప్రచారాలకు ఇక కాలం చెల్లిందని అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు.. ప్రజలు మీపై ఓ కన్నేసి పెట్టారు.. మీరు ఎవరిని కలుస్తున్నారో గమనిస్తున్నారు.. అధికారం ఉందని ఇగోకు పోతే మీరే నష్టపోతారు అని హెచ్చరించారు… ఫ్లెక్సీల దగ్గర గొడవపడుతున్నారు.. కార్యకర్తలు తప్పుచేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది.. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు నన్ను బాధపెట్టాయి అన్నారు.. ఎన్డీఏలో ఉన్నాం, మన ఉనికి కాపాడుకోవాలి.. ఐకమత్యం కాపాడాలి అని సూచించారు.. కేంద్రానికి, రాష్ట్రానికి చెడ్డపేరు రాకుండా పనిచేస్తున్నాం.. ఈ స్ఫూర్తి గ్రామం వరకు కొనసాగాలని స్పష్టం చేశారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh Politics
  • Chandrababu Amaravati meeting
  • Chandrababu Naidu speech
  • Chandrababu warning to TDP leaders
  • TDP latest news

తాజావార్తలు

  • Audi Q4 e-Tron Facelift: కొత్త 2026 ఆడి Q4 e-tron ఫేస్‌లిఫ్ట్ లాంచ్.. ట్రిపుల్ స్క్రీన్స్, 592KM రేంజ్

  • Nature Health Study: మీ ఇంటి పక్కనే పొలం ఉందా? అయితే మీకు క్యాన్సర్లు వచ్చే ముప్పు 150% ఉందట..

  • Chandrababu warning: పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్.. తప్పులు చేస్తే హెడ్‌లైన్స్‌లోకి వెళ్తారు అంటూ హెచ్చరిక

  • IPL Teams Profits: ట్రోఫీ గెలవకపోయినా లాభాలే లాభాలు.. ఐపీఎల్ టీమ్స్ అసలు బిజినెస్ ఇదే, లెక్కలు తెలిస్తే మైండ్ బ్లాకే!

  • Chandrababu: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది.. కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారు.. ఎవ్వరికీ తలవంచరు..

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions