Janasena Party: కర్ణాటకలో జనసేన విస్తరణకు శ్రీకారం.. పార్టీలో భారీగా చేరికలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Janasena Party: జనసేన పార్టీ కర్ణాటక రాష్ట్రంలో తన విస్తరణకు శ్రీకారం చుట్టింది. చిత్రదుర్గ జిల్లా వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. దాదాపు 200 మందికి పైగా అధికారికంగా పార్టీ సభ్యత్వం స్వీకరించారు. ఈ చేరికల కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శులు నాగబాబు, తాళ్లూరి రామ్ పాల్గొన్నారు. పార్టీలో చేరిన వారికి పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. కర్ణాటకలో జనసేన పార్టీ బలోపేతానికి ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు.
Read Also: Aditya Dhar: మరోసారి ‘ధురంధర్’ కాంబో రిపీట్ ..
Also Read
- APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
- Chandrababu–Pawan Kalyan Meeting: చంద్రబాబు–పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు.. స్థానిక ఎన్నికలపై ఫోకస్
- Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
- CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
ఈ సందర్భంగా తాళ్లూరి రామ్ మాట్లాడుతూ, వ్యవస్థలో సమూల మార్పు తీసుకురావడమే జనసేన పార్టీ లక్ష్యమని తెలిపారు. కొత్త తరహా నాయకత్వాన్ని ప్రోత్సహించడం పార్టీ ప్రధాన ఉద్దేశమని చెప్పారు. జనసేన ప్రాంతాలకు, భాషలకు అతీతంగా ప్రజల కోసం పని చేసే పార్టీ అని పేర్కొన్నారు. ప్రజల పక్షాన నిలబడి సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే పార్టీ సిద్ధాంతమని నాయకులు తెలిపారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేస్తూ, పార్టీ భావజాలానికి అనుగుణంగా ప్రజాసేవ చేయాలని పిలుపునిచ్చారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలవాలని సూచించారు.
జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆలోచనలు, పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై కర్ణాటక రాష్ట్రంలో పార్టీని విస్తరించాలని అక్కడి నాయకులు, ప్రజలు కొంతకాలంగా విజ్ఞప్తులు చేస్తున్నట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు చిత్రదుర్గ జిల్లాలో ఈ చేరికల కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కర్ణాటకలో జనసేన పార్టీ విస్తరణకు ఇది తొలి పెద్ద అడుగుగా భావిస్తున్న నాయకులు, రానున్న రోజుల్లో మరింత బలోపేతం దిశగా కృషి చేస్తామని స్పష్టం చేశారు.
జనసేన పార్టీ అధినేత, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి ఆలోచనలకు, జనసేన పార్టీ భావజాలానికి ఆకర్షితులై, కర్ణాటక రాష్ట్రంలో పార్టీని విస్తరించాలంటూ కొంతకాలంగా అక్కడి నాయకుల నుండి, ప్రజలు నుండి విజ్ఞప్తులు రావడంతో, జనసేన పార్టీ అధినేత, గౌరవ ఆంధ్రప్రదేశ్… pic.twitter.com/gZ2ZW5Up7U
— JanaSena Party (@JanaSenaParty) April 28, 2026
తాజావార్తలు
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
-
Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
-
APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!