IPL Teams Profits: ట్రోఫీ గెలవకపోయినా లాభాలే లాభాలు.. ఐపీఎల్ టీమ్స్ అసలు బిజినెస్ ఇదే, లెక్కలు తెలిస్తే మైండ్ బ్లాకే!
- ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ లీగ్ ఐపీఎల్
- ట్రోఫీ గెలవకపోయినా లాభాలే లాభాలు
- ఐపీఎల్ టీమ్స్ అసలు బిజినెస్ ఇదే
- ఐపీఎల్ లెక్కలు తెలిస్తే మైండ్ బ్లాకే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL Business Model Explained: ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ లీగ్‌గా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పేరొందింది. ప్రపంచంలో ఎన్నో లీగ్‌లు ఉన్నా ఐపీఎల్ మాదిరి సక్సెస్ కాలేకపోయాయి. అలాంటి ఐపీఎల్‌లో విజయం సాధిస్తేనే లాభాలు వస్తాయని చాలా మంది భావిస్తారు. కానీ వాస్తవం మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. ఐపీఎల్‌లో ట్రోఫీ గెలవకపోయినా.. జట్లు భారీగా ఆదాయం పొందుతున్నాయి. ఆ లెక్కలు తెలిస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు.
నివేదికల ప్రకారం… ఐపీఎల్‌లో ప్రతి జట్టుకు సంవత్సరానికి రూ.480 కోట్లకు పైగా ఆదాయం కేంద్ర కాంట్రాక్ట్ ద్వారా వస్తుంది. ఈ మొత్తం ప్రధానంగా మీడియా హక్కుల ద్వారా వచ్చే భారీ ఆదాయం (సుమారు రూ.48,000 కోట్ల పూల్) నుంచి భాగస్వామ్యంగా అందుతుంది. ఈ డబ్బు అన్ని జట్లకు సమానంగా షేర్ అవుతుంది. ఖర్చుల విషయానికి వస్తే.. ప్లేయర్ సాలరీ సుమారు రూ.120 కోట్లు ఉంటుంది. మొత్తం నిర్వహణ ఖర్చులు కలిపి దాదాపు రూ.170 కోట్ల వరకు ఉంటాయి. ఆదాయం రూ.480 కోట్లు కాగా.. అందులో ఖర్చులు కేవలం రూ.170 కోట్లే. అంటే దాదాపుగా రూ.300 కోట్లు లాభం అన్నమాట.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
ఒకవేళ ఐపీఎల్ ట్రోఫీ గెలిస్తే వచ్చే ప్రైజ్ మనీ సుమారు రూ.20 కోట్లు మాత్రమే. ఇది మొత్తం ఆదాయంలో కేవలం 4-5 శాతం మాత్రమే. అంటే అసలు ఆదాయం ట్రోఫీ గెలిస్తే రాదు. ఇతర వనరుల నుంచే ప్రాంచైజీలకు భారీగా ఆదాయం వస్తోంది. స్పాన్సర్‌షిప్‌లు, టికెట్ అమ్మకాలు, మెర్చండైజ్, వ్యూయర్‌షిప్ ద్వారా ఆదాయం వస్తుంది. బ్రాండ్లు ట్రోఫీల కోసం కాకుండా.. ప్రేక్షకుల దృష్టి కోసం డబ్బు పెట్టుబడి పెడతాయి. ప్రతి జట్టుకు 10కి పైగా స్పాన్సర్లు ఉంటారు.
పై లెక్కలు అన్ని చూస్తే.. ఐపీఎల్‌లో ఏ జట్టు కూడా నష్టాల్లోకి వెళ్లదు అని చెప్పొచ్చు. ప్రతి జట్టు వాల్యూ ఏడాదికి పెరుగుతూ ఉంటుంది. పంజాబ్ కింగ్స్ జట్టు గత 18 సంవత్సరాల్లో ఒక్క ట్రోఫీ కూడా గెలవకపోయినా.. దాని బ్రాండ్ వాల్యూ సుమారు రూ.9,000 కోట్లు. ఐపీఎల్‌లో ప్రతి జట్టుకు భారీగా ఆదాయం వస్తుందని చెప్పడానికి ఇదే ఓ చిన్న ఉదాహరణగా చెప్పొచ్చు. ఐపీఎల్‌లో విజయం మాత్రమే కాదు.. వ్యాపార వ్యూహం కూడా కీలకం. ట్రోఫీ గెలవకపోయినా..సరైన బ్రాండింగ్, ప్రేక్షకుల ఆదరణతో జట్లు భారీ లాభాలు ఆర్జిస్తున్నాయి.
తాజావార్తలు
-
T20 GOAT: 8 మంది దిగ్గజాల్లో రోహిత్ ఊసేలేదు.. కింగ్ కోహ్లీకి షాక్.. టీ20 క్రికెట్ ‘గోట్’గా మనోడే!
-
Shreyas Iyer: లేడీ ఫ్యాన్‌కు శ్రేయస్ అయ్యర్ క్షమాపణలు.. ‘బెస్ట్ ఇన్నింగ్స్ గిఫ్ట్‌గా ఇస్తా’..
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
ట్రెండింగ్
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు