Chandrababu: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది.. కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారు.. ఎవ్వరికీ తలవంచరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu: తెలుగు జాతి ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీ కొనసాగుతుందని ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. టీడీపీ నూతన కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, పార్టీ కార్యకర్తలే అసలు బలం అని పేర్కొన్నారు. తెలుగుదేశం కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారని, ఎవరికీ తలవంచరని అన్నారు. నూతన కమిటీలను ఎన్నో వడపోతలు, వ్యూహాలతో ఏర్పాటు చేశామని చంద్రబాబు తెలిపారు. సీనియర్లను గౌరవిస్తూ, కొత్తవారికి అవకాశాలు కల్పిస్తూ, కష్టపడి పనిచేసిన వారికి చోటు కల్పించేలా కమిటీలను రూపొందించామని చెప్పారు. కార్యకర్తే అధినేత అనే నినాదాన్ని కేవలం మాటలకే పరిమితం చేయకుండా విధానంగా మార్చుకున్నామని పేర్కొన్నారు.
Read Also: TDP నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం.. చంద్రబాబు ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం
Also Read
- టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
- How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
- Hyderabad: ఉప్పల్లో మ్యాచ్కు ముందు సంచలనం.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు అరెస్ట్..!
- Sushila Devi Inspirational Story: 63 ఏళ్ల వయసులో పదో తరగతి పాసైన బామ్మ.. 79.6 శాతం మార్కులతో అదరగొట్టిందిగా..
ఓ మండల పార్టీ అధ్యక్షురాలికి, క్లస్టర్ ఇన్‌చార్జికి పొలిట్‌బ్యూరోలో స్థానం కల్పించామని తెలిపారు. మహిళలకు అధిక ప్రాధాన్యం ఇచ్చామని, మహిళా బిల్లుకు పూర్తిగా మద్దతు ఇచ్చామని చెప్పారు. చదువుకున్న వారికి మంత్రి పదవులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు చంద్రబాబు.. రామ్మోహన్ నాయుడు, శబరి, రాజేష్ వంటి యువ నాయకులను జాతీయ ఉపాధ్యక్షులుగా నియమించామని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో నారా లోకేష్ కీలక పాత్ర పోషించారని, ట్రైనింగ్ క్లాసులు నుంచి కార్యకర్తల సంక్షేమం వరకు సమర్థవంతంగా నిర్వహించారని కొనియాడారు. రాష్ట్రానికి 20 లక్షల ఉద్యోగాలు తీసుకురావాలనే లక్ష్యంతో లోకేష్ కృషి చేస్తున్నారని చంద్రబాబు తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు ఏపీకి రావడానికి లోకేష్ కృషే కారణమని పేర్కొన్నారు. ఆయన సామర్థ్యాన్ని గుర్తించి వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించామని చెప్పారు. అది పదవి కాదని, అత్యున్నత బాధ్యత అని స్పష్టం చేశారు.
ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో టీడీపీ బలం పెరగాలని, 2024 ఎన్నికల్లో వచ్చిన ఓట్లకంటే మరింత ఎక్కువ ఓట్లు సాధించాలని పిలుపునిచ్చారు. గతంలో కార్యకర్తలు ఎదుర్కొన్న కష్టాలు తనకు గుర్తున్నాయని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ కేంద్ర సహకారంతో గట్టెక్కిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఒక్కో అడుగు ముందుకు వేస్తూ వ్యవస్థలను గాడిలో పెడుతున్నామని అన్నారు. నిలిచిపోయిన కేంద్ర పథకాలను పునరుద్ధరించామని, అప్పులను రీషెడ్యూల్ చేస్తున్నామని చెప్పారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తున్నామని, ప్రజలకు వాట్సాప్ సేవలు అందిస్తున్నామని తెలిపారు. గూగుల్ క్లౌడ్ ఏఐ డేటా సెంటర్ సహా పలు ఐటీ సంస్థలను తీసుకువచ్చి విశాఖపట్నాన్ని టెక్ నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.
ప్రత్యర్థి పార్టీపై కూడా చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని నాశనం చేశారని, ఇప్పుడు కూడా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి నిధులు వస్తుంటే వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఫేక్ ప్రచారంతో ప్రజల్లో అనుమానాలు కలిగించడంలో ప్రత్యర్థి పార్టీ ముందుంటుందని విమర్శించారు. అయితే ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, కుట్రలకు ఇక కాలం చెల్లిందని స్పష్టం చేశారు టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Hyderabad: ఉప్పల్లో మ్యాచ్కు ముందు సంచలనం.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు అరెస్ట్..!
-
21st Century Best Bowler: 21వ శతాబ్దపు టాప్-10 బౌలర్లు.. టాప్ లేపిన ఆసీస్ దిగ్గజం.. బుమ్రా స్థానం ఎక్కడో తెలుసా?
-
Sushila Devi Inspirational Story: 63 ఏళ్ల వయసులో పదో తరగతి పాసైన బామ్మ.. 79.6 శాతం మార్కులతో అదరగొట్టిందిగా..
ట్రెండింగ్
-
Sound Glow ఫీచర్తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
Temba Bavuma: కెప్టెన్గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!