స్వచ్ఛ భారత్ లో మైండ్ కంట్రోల్ చాలా ముఖ్యమైన అవసరమని.. ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఇల్లు బాగు చేసుకున్నప్పుడు ప్రపంచాన్ని జయించవచ్చన్నారు. మీ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని.. ఆ తర్వాత మీ ఇంటి చుట్టూ పరిశుభ్రత ఉండేలా చూసుకోవాలని ఆయన సూచించారు. "ప్రతి నెల మూడవ శనివారం ఏ పని అవసరం లేదు.. మనల్ని మనం బాగు చేసుకోవాలి. పర్యాటకులు మోసం చేస్తే రారు, పరిశుభ్రంగా లేకుంటే రారు, హత్యలు చెస్తే…
అక్టోబర్ 2న ప్రధాని నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. దేశం మొత్తం ఒక స్ఫూర్తితో అడుగులు ముందుకు వేయాలని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. మున్సిపాలిటీలలో స్వచ్ఛతగా ముందుకు వెళ్లలేకపోయామని వెల్లడించారు. కడపలో మీడియా సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. "ఇతర దేశాలలో రోడ్లపై చెత్త వేయరు.. ఇంటికెళ్లి డస్ట్ బిన్ లో వేస్తారు..