CM Chandrababu: అందుకే కడప గడ్డపై ‘మహానాడు’ నిర్వహిస్తున్నాం!
- ప్రాణ సమాణమైన టీడీపీ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం
- దేవుని గడపలో జరిగే ఈ మహానాడు చరిత్ర సృష్టించబోతోంది
- ఈసారి ఇంకాస్త కష్టపడితే పదికి పది స్వీప్ చేస్తాం
- కడపలో ప్రజలు ఇచ్చిన తీర్పుకు ధన్యవాదాలు తెలపడం కోసమే ఈ మహానాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రాణ సమాణమైన టీడీపీ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం అంటూ కడప మహానాడులో సీఎం చంద్రబాబు నాయుడు తన ప్రసంగాన్ని ఆరంభించారు. కడప గడ్డపై తొలిసారి మహానాడు నిర్వహిస్తున్నామని, దేవుని కడపలో జరిగే మహానాడు చరిత్ర సృష్టించబోతోందన్నారు. కడపలో ప్రజలు ఇచ్చిన తీర్పుకు ధన్యవాదాలు తెలపడం కోసమే ఈ మహానాడు నిర్వహిస్తున్నాం అని సీఎం తెలిపారు. ఉమ్మడి కడప జిల్లాలో పది స్థానాలకు ఏడు స్థానాలు గెలిచి సత్తా చాటాం అని, ఈసారి ఇంకాస్త కష్టపడితే పదికి పది స్వీప్ చేస్తాం అని ధీమా వ్యక్తం చేశారు. మూడు రోజుల పాటు జరిగే పసుపు పండుగ మహానాడు ఈరోజు ఉదయం కడపలో ఆరంభమైంది.
మహానాడులో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… ‘రాయలసీమలో మహానాడు అంటే తిరుపతిలో ఉండేది. తిరుమల తొలిగడప కడపలో ఈరోజు మహానాడు చేసుకుంటున్నాం. దేవుని గడపలో జరిగే ఈ మహానాడు చరిత్ర సృష్టించబోతోంది. ఉమ్మడి కడప జిల్లాలో పది స్థానాలకు ఏడు స్థానాలు గెలిచి సత్తా చాటాం. ఈసారి ఇంకాస్త కష్టపడితే పదికి పది స్వీప్ చేస్తాం. కడపలో ప్రజలు ఇచ్చిన తీర్పుకు ధన్యవాదాలు తెలపడం కోసమే ఈ మహానాడు నిర్వహిస్తున్నాం’ అని తెలిపారు.
Also Read
- CM Revanth Reddy: రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం భేటీ.. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుపై కీలక ప్రతిపాదనలు.!
- Allu Arjun గైర్హాజరు.. కోర్టు కీలక సూచనలు.!
- Tim David Bike Celebration: బంగ్లాదేశ్‌పై ఆసీస్ క్లీన్‌స్వీప్.. బైక్‌పై స్టేడియం చుట్టేసిన టిమ్ డేవిడ్.. వైరల్ వీడియో.!
- Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
Also Read: Daggubati Purandeswari: అందుకే పాకిస్తాన్‌కు భారత్ తిరిగి సమాధానం చెప్పాల్సి వచ్చింది!
‘సార్వత్రిక ఎన్నికల్లో 57 శాతం ఓట్ షేరింగ్ సాధించాం. ఎన్డీఏతో సంబంధం పెట్టుకోవడం వల్ల కూడా మనకు కలిసి వచ్చింది. పార్టీ పని అయిపోయిందని అనుకునే వాళ్లకు.. వాళ్ల పని అయిపోయింది. పాలన అంటే హత్య రాజకీయాలు, వేధింపులు, తప్పుడు కేసులు కాదు. విధ్వంసం పేరుతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ప్రశ్నించిన కార్యకర్తలని అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారు. పీక కోస్తునా చంద్రయ్య జై తెలుగుదేశం అంటూ ప్రాణాలు వదిలాడు. ఆయనే మనకు స్ఫూర్తి. ఆ స్ఫూర్తే పార్టీని నడిపిస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా కార్యకర్తల్లో అదే జోరు. ఏమీ ఆశించకుండా పార్టీ జెండా మోస్తున్న కార్యకర్తల వల్లే విజయం సాధ్యమైంది’ అని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Tollywood : నేటివిటీ వదిలేస్తున్న తెలుగు సినిమాలు?
-
Deewana : సెన్సార్ తీరుపట్ల కంటతడి పెట్టుకున్న దీవాన దర్శకుడు
-
Bollywood : బాలీవుడ్ నటుడి ఇంట తీవ్ర కలకలం.. సోదరుడిపై గొడ్డలితో దాడి
-
Keir Starmer: యూకే ప్రధానమంత్రి పదవికి కీర్ స్టార్మర్ రాజీనామా..
-
Personal Loans: ఒక లోన్ క్లియర్ చేయడానికి మరో లోన్ తీసుకుంటున్నారా? షాకింగ్ ఫాక్ట్స్
ట్రెండింగ్
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్‌బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!