Allu Arjun గైర్హాజరు.. కోర్టు కీలక సూచనలు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allu Arjun Absent: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో నాంపల్లి కోర్టులో సోమవారం విచారణ జరిగింది. అయితే వ్యక్తిగత కారణాల వల్ల నటుడు అల్లు అర్జున్ కోర్టుకు హాజరు కాలేకపోయారని ఆయన తరఫు న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు. దీంతో ఆయన గైర్హాజరుకు సంబంధించి మెమో దాఖలు చేయాలని కోర్టు సూచించగా, అల్లు అర్జున్ తరఫు న్యాయవాది అబ్సెంట్ పిటిషన్‌ను సమర్పించారు.
ఈ సందర్భంగా అల్లు అర్జున్ను వర్చువల్‌గా విచారణకు హాజరయ్యేలా అనుమతించాలా లేదా అన్న అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని సంధ్య థియేటర్ తరఫు న్యాయవాది భాను చందర్ వెల్లడించారు. కేసులోని ఇతర నిందితులు సహా మొత్తం 21 మంది కోర్టుకు హాజరైనట్లు తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను జూలై 6వ తేదీకి వాయిదా వేశారు. ఈ కేసులో అల్లు అర్జున్ను A11 నిందితుడిగా పోలీసులు చేర్చిన విషయం తెలిసిందే. ఆయన వ్యక్తిగత హాజరు కోసం కోర్టు సమన్లు జారీ చేసినప్పటికీ.. హాజరు కాలేకపోవడానికి గల కారణాలను ఆయన న్యాయవాది కోర్టుకు వివరించారు.
Also Read
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
- Gautam Gambhir: "ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?".. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
- 8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
- LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
మరోవైపు A1 నుంచి A10 వరకు నిందితులుగా సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని చేర్చిన పోలీసులు మొత్తం 23 మందిపై ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఇప్పటికే 19 మంది నిందితులకు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. 2024 డిసెంబర్ 4న ‘పుష్ప-2’ బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద భారీ సంఖ్యలో అభిమానులు తరలిరావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆ ఘటనలో దర్యాప్తు పూర్తి చేసిన పోలీసులు 23 మందిని నిందితులుగా పేర్కొంటూ కోర్టుకు ఛార్జ్‌షీట్ సమర్పించారు.
తాజావార్తలు
-
JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Gautam Gambhir: “ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?”.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!