మహానాడులో దివంగత ఎన్టీఆర్ ఏఐ వీడియోలు పెట్టడం దారుణమని మాజీ ఎంపీ భారత్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబును ఎన్టీఆర్ ఔరంగాజేబ్ తో పోల్చారని సంచలన వ్యాఖ్య చేశారు.
CM Chandrababu: మహానాడు 2025 సమావేశం ముగిసిన తర్వాత టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యనేతలు, గ్రామస్థాయి నాయకులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలీకాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు పలు అంశాలపై చర్చించారు. టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన నేతలతో మాట్లాడుతూ.. కడప మహానాడు అద్భుతంగా జరిగిందని.. జిల్లా నాయకత్వమంతా కలిసి పనిచేసి విజయవంతం చేశారని ఆయన అన్నారు. మహానాడు సక్సెస్ చేసిన నేతలకు అభినందనలు తెలిపారు. అలాగే కార్యకర్తలకు నా హాట్సాఫ్ అని అన్నారు. Read Also:…
Nara Lokesh: కడప జిల్లాలో నిర్వహిస్తున్న మహానాడు బహిరంగ సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. పౌరుషాల గడ్డపై టీడీపీ జెండా రెపరెపలాడుతోంది అన్నారు. 175 నియోజకవర్గాలకు గాను 164 సాధించాం ఇది ఆల్ టైం రికార్డ్ అని పేర్కొన్నారు. జెండా పీకేస్తాం అన్నారు.. ఇప్పుడు వాళ్ళ పార్టీ ఆఫీసుకు టూలేట్ బోర్డు పెట్టారని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. టీడీపీ మహానాడు బహిరంగ సభ తర్వాత కడప నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లనున్నారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని తాజ్ హోటల్‌లో జరిగే సీఐఐ ఏజీఎం సమావేశంలో సీఎం పాల్గొంటారు. రేపు సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల మధ్య ఈ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు రేపు రాత్రికి ఢిల్లీలోనే బస చేస్తారు. ఈ పర్యటన సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులను బాబు కలిసే అవకాశముంది. యోగా దినోత్సవంకు…
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి సంకల్పంతో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ.. చంద్రబాబు గారి ప్రగతిశీల నాయకత్వంలో అంచెలంచెలుగా ఎదుగుతూ, గత నాలుగు దశాబ్దాలుగా నిరంతరం ప్రజా బాహుళ్యంలో ఉందని ప్రశంసించారు. చంద్రబాబు అపారమైన అనుభవ సంపత్తి, దూరదృష్టితో కూడిన నాయకత్వం, ప్రజాసేవ పట్ల అచంచలమైన నిబద్ధత…
కడప జిల్లాలో టీడీపీ ‘మహానాడు’ అంగరంగ వైభవంగా జరుగుతోంది. టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద పండగగా భావించే మహానాడులో ఇప్పటికే రెండు రోజులు విజయవంతగా పూర్తయ్యాయి. ఉదయం 10 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు నిర్విరామంగా సమావేశాలు నిర్వహించారు. పసుపు పండగలో రెండోరోజు ప్రతినిధుల సమావేశాలు ముగిశాయి. ఇక చివరి రోజైన గురువారం భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. మహానాడులో గురువారం మూడోరోజు భారీ బహిరంగసభ నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల…
Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని క్లీన్ ఎనర్జీ- గ్రీన్ ఎనర్జిటిక్ స్టేట్ గా క్రియేట్ చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆరు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని తెలిపారు. గ్రీన్ ఎనర్జిటిక్ అప్పుగా మారబోతుంది.. కరెంట్ ఛార్జీలు పెంచను అని ఆ రోజే చెప్పాను దానికి నేను కట్టుబడి ఉన్నాను అని ఆయన పేర్కొన్నారు.
CM Chandrababu: మహానాడులో సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కొంత మంది ప్రత్యర్థులతో చేతులు కలిపి మన మధ్య కోవర్టులుగా ఉంటున్నారు అని ఆరోపించారు. వాళ్ళ ప్రోత్సాహంతో హత్యా రాజకీయాలు చేస్తున్నారు అని పేర్కొన్నారు. ఇప్పుడు నేను ఎవరినీ నమ్మడం లేదు.. ఇలాంటి తప్పుడు పనులు చేసే ఏ కార్యకర్తను కూడా వదిలి పెట్టనని హెచ్చరించారు.
మహానాడు పెద్ద డ్రామా, చంద్రబాబు నాయుడు మహానాడులో ఫొటోలకు ఫోజులు ఇస్తున్నాడని మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ఏ ఇంటికైనా వెళ్లి తాము ఈ పని చేశామని టీడీపీ వాళ్లు ధైర్యంగా చెప్పుకోగలరా? అని వైసీపీ అధినేత ప్రశ్నించారు. టీడీపీ వాళ్లు ఇచ్చిన మేనిఫెస్టోలు, బాండ్లు, కరపత్రాలు ఇప్పటికీ ప్రతి ఇంట్లో ఉన్నాయని తెలిపారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు ఏమయ్యాయని ప్రజలు నిలదీస్తున్నారన్నారు.
కడప వేదికగా టీడీపీ మహానాడు జరుగుతోన్న వేళ.. ఆ పసుపు పండుగపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్.. మహానాడు పెద్ద డ్రామాగా అభివర్ణించిన ఆయన.. రాష్ట్రంలో ఏ ఇంటికైనా వెళ్లి తాము ఈ పనిచేశామని టీడీపీ వాళ్లు ధైర్యంగా చెప్పుకోగలరా..? అని ప్రశ్నించారు.