Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pesara Idli: ప్రతిరోజూ ఒకే రకమైన ఇడ్లీ, దోశలు తిని బోర్ కొడుతుంటే ఈసారి పెసరలతో చేసే ఈ ప్రత్యేక ఇడ్లీని ట్రై చేయండి. మినప్పప్పు అవసరం లేకుండానే చాలా మెత్తగా, స్పాంజీగా వచ్చే ఈ ఇడ్లీలు ఆరోగ్యానికి కూడా మంచివి. పెసరల్లో ప్రోటీన్లు, ఫైబర్ ఎక్కువగా ఉండటంతో ఇది పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ సరైన బ్రేక్‌ఫాస్ట్‌గా నిలుస్తుంది. మరి ఇలాంటి ‘పెసర ఇడ్లీ’ని ఎలా తయారు చేస్తారో ఇక్కడ చూసేయండి..
కావలసిన పదార్థాలు:
ఇడ్లీ కోసం:
* పెసర్లు – 1 కప్పు
* గోధుమ రవ్వ లేదా సూజీ రవ్వ – ½ కప్పు
* పెరుగు – ½ కప్పు
* అల్లం – చిన్న ముక్క
* పచ్చిమిర్చి – 2
* ఉప్పు – తగినంత
* వంట సోడా – ½ టీ స్పూన్
* నీరు – అవసరమైనంత
Also Read
- Shree Charani: ఎవరికీ అందని ఎత్తుకు ఎదిగిపోతున్న తెలుగు బిడ్డ.. రికార్డులను తిరగరాస్తున్న శ్రీచరణి..
- Smriti Irani: ‘‘కర్ణాటక, కేరళ, హిమాచల్‌లో గెలిచింది ఎలా?’’.. కాంగ్రెస్‌పై స్మృతి ఇరానీ ఫైర్
- HMD Vibe2 Pro: 64ఎంపీ సోనీ కెమెరా, 6000mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. HMD కొత్త 5G ఫోన్.. అక్టోబర్ 8న లాంచ్..
- Ketan Agarwal Case: కేతన్ హత్య 5 వేల పేజీల ఛార్జిషీట్.. పిచ్చిగా ప్రేమించిన కేతన్, హత్య చేసిన సియా..
తాలింపు కోసం:
* నూనె – 1 టీ స్పూన్
* జీలకర్ర – 1 టీ స్పూన్
* శెనగపప్పు – 1 టీ స్పూన్
* కరివేపాకు – కొద్దిగా
చట్నీ కోసం కావలసిన పదార్థాలు:
* పల్లీలు – ½ కప్పు
* వెల్లుల్లి రెబ్బలు – 10
* పచ్చిమిర్చి – 4 నుంచి 5
* జీలకర్ర – 1 టీ స్పూన్
* చింతపండు – చిన్న ముక్క
* ఉప్పు – తగినంత
* తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు
తయారీ విధానం:
ముందుగా పెసర్లను శుభ్రంగా కడిగి రాత్రంతా లేదా కనీసం నాలుగు గంటల పాటు నీటిలో నానబెట్టాలి. తర్వాత నీటిని పూర్తిగా వంపేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. అందులో అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, గోధుమ రవ్వ, పెరుగు వేసి కొద్దిగా నీరు జత చేస్తూ బరకగా గ్రైండ్ చేయాలి. పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని 10 నిమిషాలు పక్కన పెట్టాలి. దీంతో రవ్వ బాగా నానుతుంది. ఇప్పుడు పిండిలో తగినంత ఉప్పు, వంట సోడా వేసి బాగా కలపాలి. అవసరమైతే కొద్దిగా నీరు కలిపి ఇడ్లీ పిండిలా ఉండేలా చేసుకోవాలి.
మరోవైపు పాన్‌లో నూనె వేడి చేసి జీలకర్ర, శెనగపప్పు, కరివేపాకు వేసి తాలింపు సిద్ధం చేయాలి. ఈ తాలింపును పిండిలో వేసి కలపాలి. ఇడ్లీ ప్లేట్లకు కొద్దిగా నూనె రాసి పిండిని పోయాలి. ముందుగా నీరు మరిగించిన ఇడ్లీ పాత్రలో ప్లేట్లను ఉంచి సుమారు 10 నిమిషాలు ఆవిరిపై ఉడికించాలి. ఉడికిన తర్వాత రెండు నిమిషాలు చల్లారనిచ్చి ఇడ్లీలను తీసుకోవాలి. దీంతో మెత్తగా, స్పాంజీగా ఉండే పెసర ఇడ్లీలు సిద్ధమవుతాయి.
చట్నీ తయారీ:
పల్లీలను సన్నని మంటపై వేయించి పక్కన పెట్టాలి. అదే పాన్‌లో కొద్దిగా నూనె వేసి జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి, చింతపండు వేయించి చల్లారనివ్వాలి. తర్వాత పల్లీలతో పాటు ఇవన్నీ మిక్సీ జార్లో వేసి ఉప్పు, నీరు జత చేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. చివరగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకుతో తాలింపు పెట్టి చట్నీలో కలపాలి. వేడివేడిగా ఉన్న పెసర ఇడ్లీలను ఈ పల్లీ చట్నీతో సర్వ్ చేస్తే రుచి అద్భుతంగా ఉంటుంది. సాధారణ ఇడ్లీలకు బదులుగా ఈ హెల్దీ వెర్షన్‌ను ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.
తాజావార్తలు
-
Shree Charani: ఎవరికీ అందని ఎత్తుకు ఎదిగిపోతున్న తెలుగు బిడ్డ.. రికార్డులను తిరగరాస్తున్న శ్రీచరణి..
-
Smriti Irani: ‘‘కర్ణాటక, కేరళ, హిమాచల్‌లో గెలిచింది ఎలా?’’.. కాంగ్రెస్‌పై స్మృతి ఇరానీ ఫైర్
-
AI Driving Test : డ్రైవింగ్ పరీక్షల్లో ‘ఏఐ’ విప్లవం.. మానవ జోక్యానికి చెక్ పెడుతూ కీలక నిర్ణయం..!
-
CDSCO: పదేపదే ట్యాబ్లెట్లు వాడుతున్నారా?
-
HMD Vibe2 Pro: 64ఎంపీ సోనీ కెమెరా, 6000mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. HMD కొత్త 5G ఫోన్.. అక్టోబర్ 8న లాంచ్..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!