CM Revanth Reddy: రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం భేటీ.. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుపై కీలక ప్రతిపాదనలు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy Meets Rajnath Singh: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులపై ఆయన చర్చించారు. ముఖ్యంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం రక్షణ శాఖకు చెందిన భూములను బదిలీ చేసినందుకు కేంద్ర మంత్రికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు అభివృద్ధి అంశాన్ని కూడా ఈ సమావేశంలో ఆయన ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ, యుటిలిటీల బదిలీ తదితర అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని సీఎం హామీ ఇచ్చారు. దేశ రక్షణ, సమగ్రతకు సంబంధించిన అంశం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని కేంద్ర మంత్రికి తెలిపారు.
Also Read
- LNG Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. దేశంలో తొలి LNG రైలుకు గ్రీన్ సిగ్నల్..
- Bank Strike: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల బ్యాంక్ సమ్మె.. కారణం ఇదే
- IND Vs WI: సెంచరీతో చెలరేగిన గ్రీవ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం..
- Parvesh Verma Slap Row: ఆప్ ఎమ్మెల్యేతో వాగ్వాదం.. యువకుడిని కొట్టిన ఢిల్లీ మంత్రి..
ఆదిలాబాద్‌లో భారత వాయుసేనకు సంబంధించిన ఎయిర్ పోర్టును భారీ స్థాయిలో విస్తరించే ప్రణాళికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించేందుకు సిద్ధంగా ఉందని సీఎం అన్నారు. భారత వాయుసేన టెర్మినల్‌తో పాటు ప్రయాణికుల కోసం పౌర విమానయాన శాఖ ఆధ్వర్యంలో నిర్మించనున్న టెర్మినల్ భవనం, కార్గో సదుపాయాలు, ఎంఆర్వో (మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్‌హాల్) కేంద్రాలు, హ్యాంగర్ల ఏర్పాటు వంటి అంశాలకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు.
ప్రస్తుతం మధ్యప్రాచ్య ప్రాంతంలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ప్రపంచ ప్రఖ్యాత విమానయాన సంస్థలు తమ హ్యాంగర్లు ఏర్పాటు చేసుకునేందుకు ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టును అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, ఉపాధి అవకాశాల పెంపునకు దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.
అదేవిధంగా మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర సమీపంలో డీఆర్డీవో/డీఆర్డీఎల్ ఎంపిక చేసిన ప్రదేశంలో చేపట్టనున్న కీలక రక్షణ ప్రాజెక్టుకు త్వరితగతిన ఆమోదం ఇవ్వాలని కూడా కేంద్ర రక్షణ శాఖ మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. ఈ ప్రాజెక్టు దేశ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడంతో పాటు తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.
- Tags
- Adilabad
- airport
- drdl
- DRDO
- Rajnath Singh
తాజావార్తలు
-
Venkatesh: “20 ఏళ్ల తర్వాత మళ్లీ త్రివిక్రమ్‌తో .. పెళ్లికాని ప్రసాద్ కాలం పోయింది”
-
Trivikram Srinivas: ‘ఆయన అంటే గౌరవంతో కూడిన ఇష్టంతో వచ్చిన భయం’ వెంకీ మామపై త్రివిక్రమ్ వైరల్ కామెంట్స్!
-
LNG Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. దేశంలో తొలి LNG రైలుకు గ్రీన్ సిగ్నల్..
-
Bank Strike: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల బ్యాంక్ సమ్మె.. కారణం ఇదే
-
Karthi: “డీఎంకే అయినా.. టీవీకే అయినా ఇంతేనా?” విజయ్ సర్కార్‌ను నిలదీసిన హీరో కార్తి!
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?