Tim David Bike Celebration: బంగ్లాదేశ్‌పై ఆసీస్ క్లీన్‌స్వీప్.. బైక్‌పై స్టేడియం చుట్టేసిన టిమ్ డేవిడ్.. వైరల్ వీడియో.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tim David Bike Celebration: బంగ్లాదేశ్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆస్ట్రేలియా 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. అయితే సిరీస్ విజయంతో పాటు మ్యాచ్ అనంతరం ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ టిమ్ డేవిడ్ చేసిన వినూత్న సంబరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఢాకాలోని షేర్-ఎ-బంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన 3వ టీ20 మ్యాచ్‌లో విజయం సాధించిన తర్వాత ట్రోఫీ ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా టిమ్ డేవిడ్ ఓ ఆకుపచ్చ రంగు సుజుకి జిక్సర్ బైక్‌పై స్టేడియం మైదానంలో చక్కర్లు కొట్టాడు. అతనితో పాటు సహచర ఆటగాడు మ్యాట్ రెన్షా వెనుక సీటులో కూర్చొని ఆ సెలబ్రేషన్లో పాల్గొన్నాడు.
Also Read
- RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
- PM Modi: సీఎంగా మొదలై ప్రధాని వరకు.. ప్రధాని 25 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం.. ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు
బైక్‌పై స్టేడియం చుట్టూ తిరుగుతూ టిమ్ డేవిడ్ అభిమానులను అలరించాడు. సహచర ఆటగాళ్లు చప్పట్లు కొడుతూ అతడిని అభినందించగా.. ప్రేక్షకులు తమ మొబైల్ ఫోన్లలో ఈ అరుదైన దృశ్యాన్ని బంధించారు. మ్యాచ్ అనంతరం జరిగిన ఈ సంబరం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టిమ్ డేవిడ్ ఇలాంటి వినూత్న సంబరాలకు కొత్తేమీ కాదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడిన సమయంలో కూడా విజయాల తర్వాత అతడు చేసిన సరదా వేడుకలు కూడా వైరల్ అయ్యాయి. తాజాగా బంగ్లాదేశ్ సిరీస్ అనంతరం చేసిన బైక్ రైడ్ కూడా ఆ లిస్ట్ లో చేరింది.
ఇక సిరీస్ విషయానికి వస్తే.. ఆస్ట్రేలియా మూడు మ్యాచ్‌ల్లోనూ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణించిన ఆసీస్ జట్టు బంగ్లాదేశ్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా సిరీస్‌ను కైవసం చేసుకుంది. బంగ్లాదేశ్ చివరి టీ20లో నిర్ణిత 20 ఓవర్లలో 109/8 పరుగులకే పరిమితమవ్వగా.. ఆస్ట్రేలియా కేవలం 11 ఓవర్లు లోనే టార్గెట్ ను ఛేదించి బంగ్లాను క్లీన్ స్వీప్ చేసింది.
TIM DAVID never fails to entertain us 😭
– Bro casually riding a bike on the ground with matt short.
– Gangster for a reason 🔥💀 pic.twitter.com/jd3G6jrE1U— HK (@potter_here18) June 21, 2026
తాజావార్తలు
-
Bhuvneshwar Kumar Comeback: అగార్కర్ హయాంలో భువనేశ్వర్‌కు ఎందుకు చోటు దక్కలేదు?
-
RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
-
Dhanush Political Entry : తమిళనాడు రాజకీయాల్లోకి ధనుష్.. పార్టీ పేరు ఇదే?
-
Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
-
Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
ట్రెండింగ్
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!