CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు ఈ రోజు (ఏప్రిల్ 5న) ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం చందర్లపాడు మండలంలో పర్యటించనున్నారు. బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా ముప్పాళ్లలో ఏర్పాటు చేస్తున్న ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొని స్థానిక ప్రజలతో ముఖాముఖి మాట్లాడనున్నారు. ఇక, ఉదయం 10:15 గంటలకు ఉండవల్లిలోని నివాసం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11:30 గంటలకు చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామానికి చేరుకోనున్నారు. హెలిప్యాడ్ దగ్గర అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు స్వాగతం పలికిన తర్వాత రోడ్డు మార్గంలో ముప్పాళ్ల గ్రామంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలకు చేరుకోనున్నారు. ఆ తర్వాత ఉదయం 11:46 గంటలకు నిమ్మతోటలో ఏర్పాటు చేసిన ప్రజా వేదిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు.
Read Also: LSG vs MI: ఉత్కంఠ పోరులో ముంబైపై లక్నో గెలుపు
అయితే, అక్కడ విద్యార్థులకు సీఎం చంద్రబాబు ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేయడంతో పాటు ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఇక, మధ్యాహ్నం 2:15 గంటలకు ముప్పాళ్లలోని వేబ్రిడ్జ్ స్థలం దగ్గర ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం మధ్యా్హ్నం 3:40 గంటలకు అక్కడ నుంచి బయలుదేరి హెలిప్యాడ్ దగ్గరకు చేరుకుని తిరుగు ప్రయాణం అవుతారు. అలాగే, సాయంత్రం 4:05 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకోనున్నారు.