Vishwambhara vs Mass Jathara : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంభర. వశిష్ట డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా టీజర్ ఇప్పటికే రిలీజ్ అయింది. ఇందులో చిరు లుక్ అదిరిపోయింది. వాస్తవానికి ఈ సినిమా సంక్రాంతికే రిలీజ్ కావాల్సి ఉంది. అనుకోకుండా వాయిదా వేశారు. రేపు రామ రామ సాంగ్ లాంచ్ ఈవెంట్ కూడా ఉంది. ఈ సినిమాను జులై 24న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అయితే మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మాస్ జాతర. రైటర్ భాను భోగవరపు డైరెక్టర్ పనిచేస్తున్నాడు. దీన్ని సితార ఎంటర్ టైన్ మెంట్స్ భారీ బడ్జెట్ తో తీస్తోంది. అయితే ఈ సినిమాను జులై 18న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారంట.
Read Also : Vontimitta Kodandarama Swamy: అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం
అంటే వారం గ్యాప్ లో ఈ రెండు సినిమాలు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలకు బాక్సాఫీస్ వద్ద క్లాష్ తప్పదని అంటున్నారు. అయితే ఇప్పటి వరకు చిరంజీవి, రవితేజ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా పోటీ పడలేదు. ఈ సారి కూడా పోటీ పడే అవకాశం ఉండకపోవచ్చనే వారి ఫ్యాన్స్ భావిస్తున్నారు. కానీ బాక్సాఫీస్ వార్స్ ఈ నడుమ సీరియస్ గా కాకుండా ఫ్రెండ్లీగానే ఉంటున్నాయి. ఈ నడుమ స్టార్ హీరోలు కూడా డేట్స్ అడ్జస్ట్ కాక ఒకే తేదీల్లో కూడా రిలీజ్ చేస్తూ పరస్పరం సహకరించుకుంటున్నారు. ఇప్పుడు ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్లు ప్రకటిస్తే దానిపై క్లారిటీ వస్తుంది. రేపు విశ్వంభర సాంగ్ లాంచ్ ఈవెంట్ లో ఏమైనా రిలీజ్ అప్డేట్ వస్తుందేమో చూడాలి.