CM Chandrababu: హైటెక్ సిటీ రాక ముందు హైదరాబాద్‌లో ఎకరం రూ.లక్ష.. ఇప్పుడు రూ.100 కోట్లు..
- హైటెక్ సిటీ రాక ముందు హైదరాబాద్ ఎకరం రూ.లక్ష..
- ఇప్పుడు రూ.100 కోట్లకు చేరిందన్న సీఎం చంద్రబాబు..
- అమరావతి అభివృద్ధి నిరంతర ప్రక్రియ..
- హైదరాబాద్ తరహాలోనే అభివృద్ధి జరుగుతూ ఉంటుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: హైటెక్ సిటీ రాక ముందు హైదరాబాద్ ఎకరం రూ.లక్ష ఉండేది.. ఇప్పుడు రూ.100 కోట్లకు చేరిందన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. వే టూ న్యూస్ కాంక్లేవ్ లో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. అమరావతి అభివృద్ధి నిరంతర ప్రక్రియ.. హైదరాబాద్ తరహాలోనే అభివృద్ధి జరుగుతూ ఉంటుందన్నారు.. పోలవరం వచ్చే రెండేళ్లలో పూర్తి చేస్తాం.. అమరావతిలో మొత్తం ప్రైవేట్ భూములే.. పరిశ్రమలు, అభివృద్ధితో భూమి విలువ పెరుగుతుంది… అమరావతి రైతులకు అన్యాయం జరగదు. అమరావతి అభివృద్ధి అనేది కంటిన్యూగా ఉంటుంది. అభివృద్ధిని కొంత మేరకే పరిమితం చేస్తే… అమరావతి ఓ చిన్న మున్సిపాల్టీగా మిగిలిపోతుంది. హైదరాబాద్ తరహాలో అమరావతి కూడా మహానగరంగా మారుతుంది. గుంటూరు -విజయవాడ – తెనాలి – గ్రామాలు కలిస్తేనే మహానగరంగా మారుతుందన్నారు..
Read Also: UP: తన ప్రైవేట్ పార్టును తానే కోసుకున్న యూపీఎస్సీ విద్యార్థి.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
Also Read
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
- Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
- UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
భూములిచ్చిన వారిని ఆదుకుంటాం… విస్తరణ విషయంలోనూ ఏ మాత్రం ఇబ్బంది లేకుండా అభివృద్ధి చేస్తాం అన్నారు చంద్రబాబు.. ఇప్పుడు ఉండే భూమి ఇప్పటికే సరిపోతుంది.. అవసరమైన మేరకు రైతులతో మాట్లాడి అమరావతిని అభివృద్ధి చేస్తాం అన్నారు.. క్వాంటం వ్యాలీకి శ్రీకారం చుట్టాం… క్వాంటం కంప్యూటింగ్ కు అవసరమైన అనుబంధ సంస్థలు పెట్టడానికి పలు సంస్థలు ముందుకు వచ్చాయి. అలాగే జాతీయ, అంతర్జాతీయ ప్రముఖ విద్యా సంస్థలు కొన్ని ఉన్నాయి… ఇంకొన్ని రాబోతున్నాయని వెల్లడించారు.. ఒకప్పుడు రాయలసీమలో 10 ఏళ్లల్లో 8 ఏళ్లు కరవు ఉండేది. ట్యాంకర్లల్లో నీళ్లు తీసుకెళ్లాల్సిన పరిస్థితి రాయలసీమలో ఉండేది. దేశంలో ఇప్పటికీ అతి తక్కువ వర్షపాతం ఉన్న జిల్లా అనంతపురం… కానీ, నీళ్లను ఇవ్వడంతో అక్కడ పరిస్థితి మారిందని తెలిపారు.. కోస్తా జిల్లాల కంటే అనంతపురం జిల్లానే జీఎస్డీపీలో టాప్ పొజిషన్లో ఉంది. హార్టికల్చర్ సాగు వల్లే ఇది సాధ్యం. నీళ్లు లేకపోయినా ఫర్వాలేదు.. రోడ్లు లేకపోయినా ఫర్వాలేదంటే… మనం ఇక్కడే ఉంటాం అన్నారు చంద్రబాబు.
Read Also: Fire Crakers: బాణాసంచాపై దేశవ్యాప్తంగా నిబంధనలు అమలు చేయాలి
వృథా జలాలను మాత్రమే బనకచర్లకు వినియోగించుకుంటామని చెబుతున్నాం. పెద్ద పెద్ద సంస్థలన్నీ సొంత డబ్బులతో పెడుతున్నారా…? బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చుకుంటున్నారు… పెట్టుబడులు పెడుతున్నారని తెలిపారు చంద్రబాబు.. ప్రభుత్వం కూడా అదే తరహాలో ప్రాజెక్టులు చేపడుతోంది. చిన్న చిన్న విషయాల్లో ఆలోచనలతోనే ఆపేస్తే ఇక్కడితోనే ఆగిపోతాం. ఇంజనీరింగ్ కాలేజీల విషయంలో నాడు నేను తీసుకున్న నిర్ణయాల వల్లే రైతు కూలీల పిల్లలు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు అయ్యారన్నారు. ఇక, మెడికల్ కాలేజీలు కట్టకుండా… కట్టేశామని చెబుతున్నారు. మేం ప్రైవేట్ వారికి అప్పజెప్పడం లేదు… పీపీపీ పద్ధతినే నిర్మాణం చేపడుతున్నాం.. ఏ ఒక్కరికీ అన్యాయం జరగదు.. నిర్వహణ ప్రభుత్వానిదే. వైద్య విద్యార్థులకు, వైద్య సేవలకు ఇబ్బంది రాకుండా చేసే బాధ్యత మా ప్రభుత్వానిది. ఏదో బెదిరింపులు చేస్తే బెదిరిపోయే పరిస్థితి రాదు అని స్పష్టం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!