UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
- 2027 యూపీ ఎన్నికల ముందు ఎస్పీ–కాంగ్రెస్ సీట్ల రచ్చ
- కనీసం 150 సీట్లలో పోటీ చేయాలని కాంగ్రెస్ డిమాండ్
- 150 సీట్లు ఇవ్వడం అటుంచి 50 సీట్లు కూడా పెద్ద విషయమే అన్న ఎస్పీ ఎంపీ
- పార్టీల రాజకీయ బలం ఆధారంగా సీట్ల పంపకం జరగాలన్న పటేల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP Election: 2027 ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల వేళ సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)-కాంగ్రెస్ మధ్య సీట్ల లెక్కల్లో విభేదాలు తలెత్తుతున్నాయి. రెండు పార్టీల మధ్య సీట్ల బేరాలు కుదరడం లేదు. కాంగ్రెస్ ఎక్కువ సీట్లను డిమాండ్ చేయడంపై ఎస్పీ నేతలు ఫైర్ అవుతున్నారు. రాష్ట్రంలోని 403 స్థానాల్లో కనీసం 150 సీట్లలో పోటీ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే, ఈ ప్రతిపాదనను ఎస్పీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తాజాగా కాంగ్రెస్ తీరుపై ఎస్పీ ఎంపీ ఎస్పీ సింగ్ పటేల్ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్‌కు 150 సీట్లు ఇవ్వడం అటుంచి, 50 సీట్లు కూడా ఇవ్వడం పెద్ద విషయమే అని అన్నారు. యూపీలో కాంగ్రెస్‌కు క్షేత్రస్థాయిలో ఉన్న బలం, ఎంపీలు-ఎమ్మెల్యేల సంఖ్యను పరిగణలోకి తీసుకోవాలని అన్నారు.
కాంగ్రెస్ యూపీ ఇన్చార్జ్ రాజేంద్ర పాల్ గౌతమ్ ఇటీవల మాట్లాడుతూ.. 2027 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 150 సీట్లకు తగ్గకుండా పోటీ చేయాలనుకుంటోంది అని అన్నారు. 403 సీట్లలో 50 శాతం సీట్లకు కాంగ్రెస్ హక్కుదారుగా ఉందని ఆయన అన్నారు. సీట్ల పంపకంపై అక్టోబర్‌లో క్లారిటీ రావొచ్చని అన్నారు. కాంగ్రెస్ ఈ ప్రతిపాదన ఎస్పీ నేతలకు రుచించడం లేదు.
Also Read
- Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
- Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
- SH-93 Hindi Signboard Row: SH-93 హైవే బోర్డుపై హిందీ అక్షరాలు.. ఇద్దరు అధికారులు సస్పెండ్
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
ఎస్పీ సింగ్ పటేల్ రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. రాయ్‌బరేలీలో తొలుత పోటీ చేయడానికి సిద్ధపడలేదని, అఖిలేష్ యాదవ్ ఒప్పించడంతో చివరకు పోటీ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ అక్కడి నుంచి పోటీ చేయకపోతే ఎస్పీ పోటీ చేసేదని అన్నారు. కాంగ్రెస్‌కు గత ఎంపీ ఎన్నికల్లో ఎస్పీ వల్ల ప్రయోజనం చేకూరిందని అన్నారు.
తాజావార్తలు
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!