CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
- ముంబై CJP నిరసనలో మైనర్ల వినియోగంపై NHRC సీరియస్
- పిల్లలను ‘రక్షణ కవచాలుగా’ ఉపయోగించారా అనే ఆరోపణ
- అక్టోబర్ 2న శివాజీ పార్క్‌లో CJP నిరసన
- మైనర్ల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్
- ముంబై పోలీస్ కమిషనర్‌కు NHRC నోటీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CJP: CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ అక్టోబర్ 02న ముంబైలోని శివాజీ పార్క్‌లో నిరసన నిర్వహించింది. అయితే, ఈ నిరసనల్లో మైనర్ పిల్లల్ని ఉపయోగించినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. అక్టోబర్ 02న శివాజీ పార్క్‌లో జరిగిన నిరసనల్లో మైనర్లను ఉపయోగించారని, వారి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయని వచ్చిన ఫిర్యాదుపై కమిషన్ విచారణ ప్రారంభించింది.
నిరసనకు సంబంధించిన కొన్ని వీడియోల్లో, ఫోటోల్లో చిన్నారులు కనిపించారని, కొందరు రెచ్చగొట్టే నినాదాలు చేస్తున్నట్లు ఉందని సతీష్ వైద్ మానవహక్కుల సంస్థలో ఫిర్యాదు చేశారు. మైనర్లను నిరసనల్లో భాగం చేయడానికి ముందే కొన్ని గ్రూపులు, చాట్లలో చర్చలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. పోలీసుల చట్టపరమైన చర్యల నుంచి తప్పించుకోవడానికి మైనర్ పిల్లల్ని ‘‘రక్షణ కవచాలు’’గా ఉపయోగించారే కోణంలో ఫిర్యాదు అందింది.
Also Read
- Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
- UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
- Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
- Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
దీనిపై NHRC సభ్యుడు ప్రియాంక్ కనూంగో నేతృత్వంలోని ధర్మాసనం ముంబై పోలీస్ కమిషనర్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ , ఎక్స్ కార్ప్ గ్రీవెన్స్ ఆఫీసర్, మహారాష్ట్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలకు నోటీసులు జారీ చేసింది. నిరసనలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు, సోషల్ మీడియా పోస్టులు, ఇతర డిజిటల్ ఆధారాలను పరిశీలించాలని ముంబై పోలీసుల్ని ఆదేశించింది. నేరం బయపడితే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేయాలని కోరింది.
మైనర్లను ముందుగానే ప్లాన్‌లో భాగంగా తీసుకువచ్చారా? , చట్టపరమైన చర్యల్ని తప్పించుకోవడానికి ఉపయోగించారా? అనే అంశాలను పరిశీలించాలని తెలిపింది. జువైనల్ జస్టిస్ చట్టంలోని సంబంధిత నిబంధనలపై దృష్టి పెట్టాలని ఆదేశించింది. పిల్లల ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేయకుండా చర్చలు తీసుకోవాలని కోరింది. సంబంధిత అధికారులు వారం రోజుల్లో యాక్షన్ టేకింగ్ రిపోర్ట్(ATR) సమర్పించాలని NHRC కోరింది.
తాజావార్తలు
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
-
Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!