RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ అంటేనే ‘రంగస్థలం’ గుర్తొస్తుంది. కానీ, ఆ బ్లాక్ బస్టర్ కాంబోకి ఇప్పుడు మరొక పరీక్ష ఎదురైందట. ఈసారి కథను ఎంత బాగా రాస్తారు అన్నదే కాదు, ఇచ్చిన టైంలో సినిమాను పూర్తి చేస్తారా లేదా అన్నదే అసలు ప్రశ్న. ఎందుకంటే, RC 17కి 2027లో షూట్ ఫినిష్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. మరి సుకుమార్ గత ట్రాక్ రికార్డ్ చూస్తే ఈ డెడ్ లైన్ సాధ్యమేనా?
2017 ఏప్రిల్‌లో ‘రంగస్థలం’ రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఆరు నెలల్లో షూటింగ్ పూర్తి చేయాలనేది అప్పటి ప్లాన్. కానీ వాతావరణ పరిస్థితులు, లొకేషన్స్, భారీ షెడ్యూల్స్ కారణంగా షూటింగ్ అనుకున్న దానికంటే ఎక్కువ టైం పట్టింది. అయితే, ఆ డిలే సినిమాకు నష్టం చేయలేదు. ప్రతి పాత్రను, ప్రతి లొకేషన్‌ను, ప్రతి సన్నివేశాన్ని పర్ఫెక్ట్గా తీర్చిదిద్దిన ఫలితంగా.. ‘రంగస్థలం’ రామ్ చరణ్ కెరీర్లోనే ప్రత్యేకమైన సినిమాగా నిలిచింది. ‘రంగస్థలం’ తర్వాత సుకుమార్ ‘పుష్ప’ షూటింగ్ 2019లో స్టార్ట్ కావాల్సి ఉండగా, కోవిడ్ కారణంగా భారీ అంతరాయం ఏర్పడింది. ఆ తర్వాత కూడా కొన్ని షెడ్యూల్స్, లొకేషన్స్, ఆరోగ్య సమస్యల కారణంగా షూటింగ్ డిలే అయింది. అదే ట్రెండ్ ‘పుష్ప 2’ దగ్గర మరింత స్పష్టంగా కనిపించింది. ‘పుష్ప 2’ షూటింగ్ 2022లో స్టార్ట్ అయినా, 2024 నవంబర్‌లో పూర్తయింది. రిలీజ్ కూడా మొదట అనుకున్న తేదీ నుంచి మారింది.
Also Read
- Venu Swamy : "నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!"!
- Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
- Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
- Aishwarya Lekshmi: బన్నీ - అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
అంటే, సుకుమార్ సినిమాలు అంటే ఒక విషయం మాత్రం క్లియర్. స్క్రిప్ట్ నుంచి స్క్రీన్ వరకు ఆయన ఫైనల్ ప్రొడక్ట్ కోసం కచ్చితంగా ఎక్కువ టైం తీసుకునే దర్శకుడు. అయితే, ఇదే ఇప్పుడు RC 17కి పెద్ద ప్రశ్నగా మారింది. కథ కోసం టైం తీసుకోవడం సుకుమార్ స్టైల్. కానీ, RC 17 విషయంలో మాత్రం ఆ టైంకు ఒక డెడ్ లైన్ ఉంది. గతంలో స్క్రిప్ట్‌పై రెండు వర్షన్లు ఉన్నాయనే ప్రచారం జరిగినా, ఫైనల్ స్టోరీ లాక్ అయిందని టీం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు.. దసరాకి లాంచ్, నవంబర్ లేదా డిసెంబర్లో రెగ్యులర్ షూటింగ్ బిగినింగ్, 2027 చివరినాటికి షూటింగ్ కంప్లీట్, 2028లో థియేట్రికల్ రిలీజ్ టార్గెట్. అంటే, దాదాపు ఏడాది వ్యవధిలోనే RC 17 షూటింగ్‌ను కంప్లీట్ చేయాలన్నది ప్లాన్. రామ్ చరణ్ విషయంలో ‘గేమ్ చేంజర్’ కోసం సుదీర్ఘమైన ప్రొడక్షన్, ‘పెద్ది’ (RC16) కూడా అనుకున్న షెడ్యూల్ ప్రకారం రిలీజ్ కాలేదు. దాంతో చరణ్ కూడా ఇక సినిమాలకు ఎక్కువ టైం తీసుకోకూడదు అనే ఆలోచనలో ఉన్నాడు.
ఇప్పుడు RC 17తో ఒక భారీ సక్సెస్‌ను టార్గెట్ చేస్తున్నాడు. ‘ట్రిపుల్ ఆర్’ (RRR) తర్వాత ‘గేమ్ చేంజర్’ పై భారీ అంచనాలు ఉండగా డిజాస్టర్ అయింది. ఆ తర్వాత ‘పెద్ది’ కూడా రామ్ చరణ్‌కు ఆశించిన ఫలితం ఇవ్వలేదు. అందుకే RC 17తో చరణ్‌కు ఒక భారీ సక్సెస్ కావాలి. సుకుమార్‌పై ‘పుష్ప’ తర్వాత భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే RC 17 కోసం పెట్టుకున్న ఈ ఒక్క ఏడాది డెడ్ లైన్‌ను సుకుమార్ నిజంగా అందుకోగలడా? ‘రంగస్థలం’ మ్యాజిక్‌ను రిపీట్ చేయడమే కాదు, ఈసారి టైంను గెలిచి బాక్సాఫీస్‌ను కూడా గెలిపించగలడా?
తాజావార్తలు
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
-
Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!