CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
- సీజేపీ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం..
- రాజ్యాంగ రక్షకులమని భావిస్తున్నారని సీజేపీ నేతల విమర్శలు.
- అరవింద్ కేజ్రీవాల్‌ను ముందుకు తేవొద్దని కాంగ్రెస్ కౌంటర్ అటాక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CJP vs Congress: ముంబైలో కాక్రోచ్ జనతా పార్టీ(CJP) నిరసనల తర్వాత, సీజేపీ-కాంగ్రెస్ మధ్య వివాదం చెలరేగింది. సీజేపీలోని నేతలు ‘‘లిబరల్ ఎకోసిస్టమ్’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అభిజిత్ దీప్కేను లక్ష్యంగా చేసుకుని ఓ వర్గం ప్రచారం చేస్తోందని, సీజేపీ కో కన్వీనర్లు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా మండిపడ్డారు. రాంకా ఎక్స్‌లో స్పందిస్తూ.. ‘‘సెల్ఫ్ డిక్లేర్డ్ లిబరల్ ఎకో సిస్టమ్’’ అభిజీత్ దీప్కేను విమర్శించేందుకు యాక్టివేట్ అయిందని ఆరోపించారు. చాలా కాలం తర్వాత లక్షలాది భారతీయుల ఊహల్ని దీప్కే ఆకర్షించడాన్ని కొందరు ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు. ఆ వర్గం ఎక్స్‌లోనే పనిచేస్తూ, తామే ప్రజాస్వామ్యానికి ఏకైక రక్షకులమని భావిస్తోందని విమర్శించారు.
రాంకా వ్యాఖ్యల్ని సౌరవ్ దాస్ సమర్థించారు. బీజేపీకి చెందిన వారు కాకుండా మరో పార్టీకి చెందిన కొందరు ‘‘భారత్, రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత మాదే’’ అని భావిస్తున్నారని ఆరోపించారు. వారిని సెల్ఫ్ డిక్లేర్డ్ లిబరల్స్, రాజ్యాంగానికి సెల్ఫ్ డిక్లేర్డ్ థేకేదార్లు అంటూ సెటైర్లు వేశారు. ఈ వ్యవస్థ బీజేపీ ఎకోసిస్టమ్ కన్నా తీవ్రంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. డివైడ్ అండ్ రూల్ తరహా రాజకీయాలతో ప్రజల్ని విభజించలేరని అన్నారు.
Also Read
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
- Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
- UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
- Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
కాంగ్రెస్ కౌంటర్ అటాక్:
రాంకా, దాస్‌లు తమ వ్యాఖ్యల్లో ఏ పార్టీ పేరును ప్రస్తావించలేదు. అయినప్పటికీ ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్‌ను ఉద్దేశించినవిగా ఉన్నాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కౌంటర్ అటాక్ మొదలుపెట్టింది. అస్సాం కాంగ్రెస్ అధికార ప్రతినిధి రీతమ్ సింగ్ దీనిపై స్పందిస్తూ.. అస్సాంలో సీజేపీ సభ్యుల్ని, అశుతోష్ రాంకాను పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలం సహాయం చేశామని అన్నారు. కనీస మర్యాదగా సీజేపీ లీడర్లు కాంగ్రెస్ నేతల్ని కలవలేదని అన్నారు. సీజేపీ అరవింద్ కేజ్రీవాల్‌ను మళ్లీ రాజకీయంగా ముందుకు తెచ్చే వేదికగా మార్చొద్దని ఆయన అన్నారు.
An entire “self-declared liberal” ecosystem has been activated to denounce @abhijeet_dipke and the fact that he has been able to capture the imagination of millions of Indians after a LONG LONG time.
The hilarious part is that this ecosystem exists only on Twitter, but somehow…
— Ashutosh Ranka (@AshutoshRanka) October 3, 2026
It’s a very big problem. A certain section—not just the BJP—another party thinks “saving India, saving constitution” is only their job. They are self-declared liberals and self-declared thekedars of the constitution.
It’s a very salty ecosystem, acting worse than the BJP’s… https://t.co/RnbXSeX630
— Saurav Das (@SauravDassss) October 3, 2026
Ashutosh, till now I had restrained myself but let me unveil your conspiracy and sense of false pride.
When you were detained by Assam Police. We, Congress people helped to get CJP people out. Yet you categorically refused to have even a courtesy meeting with our Congress… https://t.co/cfYMgUcxuo
— Reetam Singh (@SinghReetam) October 3, 2026
తాజావార్తలు
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!