Raja The Raja Movie Launched by Cinematography Minister Komatireddy Venkata Reddy: రుత్విక్ కొండ కింది, విశాఖ దిమాన్ హీరో హీరోయిన్లుగా ఒక సినిమా మొదలైంది. వ్రిందావన్ క్రియేషన్స్ తమ తొలి సినిమాగా ఆ సినిమాను రాజా ది రాజా పేరుతో నిర్మిస్తోంది. ఈ సినిమాకు తెల్లవారితే గురువారం ఫేమ్ మణికాంత్ గెల్లి దర్శకత్వం వహిస్తున్నారు. చాణక్య అద్దంకి, నిహారిక రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న రాజా ది రాజా సినిమా హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభమైంది. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దర్శకులు రవి బాబు, ఎస్వీ కృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఈ వేడుకలో దర్శకుడు మణికాంత్ గెల్లి మాట్లాడుతూ తెల్లవారితే గురువారం సినిమా తర్వాత తాను డైరెక్షన్ చేస్తున్న మూవీ ఇదని అన్నారు. ఒక మంచి లవ్ స్టోరిని, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కలిపి తెరకెక్కిస్తున్నానని ఆయన అన్నారు.
Thandel: లెంతీ షెడ్యూల్ ముగించేసిన ‘తండేల్’.. ఫొటోస్ వైరల్
నేచర్ తో రిలేట్ అయిన ఉన్న ఒక పాయింట్ కథలో ఉంటుందని, పూర్తి కమర్షియల్ మూవీ కాకపోయినా..కమర్షియల్ గా వర్కవుట్ అయ్యేలా రూపొందిస్తున్నామన్నారు. ఈ సినిమాతో రుత్విక్ కొండకింది, విశాఖ దిమాన్ ను హీరో హీరోయిన్లుగా ఇంట్రడ్యూస్ చేస్తున్నామని అన్నారు. హీరో రుత్విక్ కొండకింది మాట్లాడుతూ – ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఎగ్జైటింగ్ గా ఉంటుంది, రేపటి నుంచి రెగ్యులర్ షూటింగ్ చేయబోతున్నామని, ఒక మంచి సినిమాతో మీ ముందుకు వస్తామని అన్నారు. హీరోయిన్ విశాఖ దిమాన్ మాట్లాడుతూ – హీరోయిన్ కావాలనేది నా డ్రీమ్, ఆ కల రాజా ది రాజా సినిమాతో నెరవేరుతున్నందుకు హ్యాపీగా ఉందన్నారు. సినిమాలో నా రోల్ చాలా బాగుంటుంది, నా క్యారెక్టర్ తో నేను ఎలా లవ్ లో పడ్డానో మీరూ అలాగే లవ్ చేస్తారన్న ఆమె సినిమా కూడా మీకు ఖచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నానని అన్నారు.