Ponnur: గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో అర్ధరాత్రి హై టెన్షన్ పరిస్థితులు నెలకొన్నాయి.. ఫ్లెక్సీ వివాదంలో ఎమ్మెల్యే వర్గానికి, ఎమ్మెల్యే వ్యతిరేక వర్గానికి మధ్య ఘర్షణ జరిగింది.. అయితే, అర్ధరాత్రి రెండు వర్గాలు పోలీస్ స్టేషన్ వద్ద బాహబాబీకి దిగాయి.. అయితే, పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.. ఆ తర్వాత పరస్పరం రాళ్లు, సీసాలతో దాడులకు దిగారు.. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ముస్లిం సామాజిక వర్గంలోని ఎమ్మెల్యే వర్గం, ఎమ్మెల్యే వ్యతిరేక వర్గానికి ఫ్లెక్సీ విషయంలో ఈ వివాదం మొదలైంది.. ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్న రెండు వర్గాలు.. పీఎస్ ఎదుటే వాగ్వాదానికి దిగడంతో పాటు.. అక్కడే పరస్పరం రాళ్లు, సీసాలతో దాడి చేసుకోవడం స్థానికంగా కలకలం రేగింది.. ఊహించని ఘటనలో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.. ఏకంగా పీఎస్ ఎదుటే.. వాగ్వాదం, పరస్పరం దాడులు జరగడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.