ఇవాళ చోడవరం, పి.గన్నవరం, పొన్నూరులో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు సీఎం జగన్. ఈ రోజు ఉదయం 10 గంటలకు అనకాపల్లి జిల్లా చోడవరంలోని కొత్తూరు జంక్షన్‌లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు అమలాపురం పార్లమెంట్ పరిధిలోని పి.గన్నవరం నియోజకవర్గంలో ఉన్న అంబాజీపేట బస్టాండ్ రోడ్డులో జరిగే సభలో.. మధ్యాహ్నం 3 గంటలకు గుంటూరు పార్లమెంట్ పరిధిలోని పొన్నూరు ఐలాండ్ సెంటర్‌లో జరిగే ప్రచార సభలో పాల్గొని ప్రసంగించనున్నారు సీఎం వైఎస్ జగన్.
పొన్నూరు నియోజకవర్గంలోని వెజేండ్ల గ్రామంలో టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా పెమ్మసారి మాట్లాడుతూ.. తెలంగాణలోని హైదరాబాద్ నగరం ఒక్కప్పుడు రాళ్లు గుట్టలుగా ఉండేది.. కానీ, చంద్రబాబు చేూసిన అభివృద్ది వల్లే.. ఇప్పుడు ఒక ఎకరం భూమి వంద కోట్ల రూపాయలకు అమ్ముడుపోతుందని ఆయన తెలిపారు.
Chandra Babu: గుంటూరు జిల్లా పొన్నూరు పర్యటనలో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ముస్లిం మైనారిటీలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మంత్రి పదవులు పొందాలంటే 10వ తరగతి చదువు అర్హత అవసరం లేదని, ప్రభుత్వ సలహాదారులకు 10వ తరగతి అర్హత అవసరం లేదని.. దుల్హన్ పథకానికి మాత్రం 10వ తరగతి చదువుకుని ఉండాలని చంద్రబాబు ఎద్దేవా చేశారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తే దుల్హన్ పథకాన్ని తీసుకువస్తానని..…