నేటి సోషల్ మీడియా ప్రపంచంలో సామాన్యులు కూడా స్టార్స్ అయ్యే అవకాశం బాగా పెరిగింది. మన తెలుగు రాష్ట్రాలలో జనాల్లో గంగవ్వ, పల్లవి ప్రశాంత్ వంటి పల్లెటూరి పేదలు విపరీతమైన పాపులారిటీ సాధించారు. ఈమధ్య దేశంలో చాలామంది సోషల్ మీడియా వేదికగా బాగా ఫేమ్ తెచ్చుకున్నారు. వీరందరి కోసం తాజాగా డిజిటల్ మీడియా ఫెడరేషన్ పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గాను మెగాస్టార్ చిరంజీవి, హీరో విజయ్ దేవరకొండ లాంటి స్టార్స్ పాల్గొన్నారు.
Also read: Rishabh Pant Fine: రిషబ్ పంత్‌కు భారీ జరిమానా.. రిపీట్ అయితే అంతే సంగతులు!
ఈ కార్యక్రంలో భాగంగా యూట్యూబ్ స్టార్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ల ను సన్మానించారు. ఈ వేదికగా యూట్యూబర్ అనిల్ గీలాకు చిరంజీవిని కలిసే అవకాశం దక్కింది. వేదికపైకి అనిల్ గీలాను ఆహ్వానించగా.. వెళ్లిన అతను చిరంజీవిని గట్టిగా హత్తుకున్నాడు. మొదటిసారి చిరంజీవిని కలవడంతో ఎమోషనల్ అయిన అనిల్ బోరున ఏడ్చేశాడు. ఈ సమయంలో యాంకర్ సుమ కనకాల సరదాగా చిరంజీవి గారి చొక్కా తడపవద్దని అన్నారు. ఎక్కడో తెలంగాణాలో ఓ మారుమూల పల్లెకు చెందిన అనిల్ చిరంజీవికి వీర అభిమాని. దాంతో చిరంజీవిని ఇంత దగ్గరగా చూసి అనిల్ కాస్త ఆనందంగా ఫీల్ అయ్యాడు.
Also read:Uttam Kumar Reddy: కేసీఆర్ ప్రెస్ మీట్ లో పవర్ కట్ లేదు.. తప్పుడు ప్రచారం చేస్తున్నారు..
ఇక అనిల్ ‘మై విలేజ్ షో’ పేరుతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మంచి పేరు సంపాదించాడు. గంగవ్వ తో చేసిన వీడియోలతో.. గంగవ్వ అత్యంత పాప్యులర్ అయ్యింది. ఆమెతోపాటు అనిల్ కూడా బాగా పాపులర్ అయ్యాడు. ఇక అనిల్ పాపులర్ చేసిన గంగవ్వ ఏకంగా బిగ్ బాస్ షోకి వెళ్లిన విషయం అందరికి తెలిసిందే.
అనిల్
One Of The Best YouTuber కష్టపడి పైకి వచ్చాడు
కష్టపడి పని చేసే ప్రతీ ఒక్కరి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారే 🥹♥️#Chiranjeevi 🙏 pic.twitter.com/bzudSNCGfB
— SANDEEP JSP (@JspSandeep_) April 1, 2024