కొన్ని రోజుల క్రితం ముగ్గురు పిల్లలను కన్న తల్లే కర్కశంగా చంపిన ఘటన రాష్ట్ర వ్యా్ప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అమీన్ పూర్ లో రజిత, చెన్నయ్య దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. వీరి సంసారంలో గెట్ టు గెదర్ పార్టీ చిచ్చుపెట్టింది. పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వెళ్లిన రజిత టెన్త్ క్లాస్ లో తనతోపాటు చదువుకున్న శివతో పాత పరిచయానికి బీజం పడింది. ఇంకేముంది.. భర్త అంటే ఇష్టం లేని రజిత శివతో…
ఈ సారి గొడవ జరిగితే నేనే ముగ్గురు పిల్లలను చంపుతానని చెన్నయ్య అన్నాడని రజిత తల్లిదండ్రులు చెప్పుకొచ్చారు. రజిత కూడా ముగ్గురు పిల్లలు చంపి నేను చచ్చిపోతానని చెప్పింది.. కానీ, పిల్లలను చంపడం ఏంటో తెలియట్లేదు.. భార్యాభర్తలు ఇద్దరిలో ఎవరో ఒకరు చచ్చినా ఏం కాకపోతుండే.. నా బిడ్డ రజిత చచ్చిపోయిన పీడా పోయేది అని వారు పేర్కొన్నారు.
Ameenpur: అమీన్పూర్లో పిల్లల హత్య కేసులో కీలక మలుపు తిరిగింది. చావు బతుకుల మధ్య ఉన్న రజిత స్టేట్మెంట్ ను పోలీసులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాత్రి షాప్ నుంచి పెరుగు తెచ్చుకున్నాం.. ఆ పెరుగుని నలుగురం కలిసి తిన్నాం.. నా గొంతులో ఏదో పట్టుకున్నట్లు అయింది.
Ameenpur: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో ఘోర ఘటన చోటుచేసుకుంది. కుటుంబికుల మధ్య ఆర్థిక వివాదం ప్రాణహానికి దారితీసింది. ఇటీవలే జేసీబీ కొనుగోలు చేసారు గోపాల్, అతని బామ్మర్ది సురేష్. అయితే గోపాల్ తన స్వార్థ ప్రయోజనాల కోసం బామ్మర్ది సురేష్ ను హత్య చేశాడు. జేసీబీ పూర్తిగా తన సొంతమవుతుందని భావించిన సురేష్, కిరాతకంగా ఈ హత్యకు పాల్పడ్డాడు. సురేష్ తన బావ గోపాల్‌ను నమ్మించి, మద్యం తాగుదామని పిలిచాడు. ఈ క్రమంలో తన స్నేహితుడిని కూడా…
HYDRA: హైదరాబాదులోని అమీన్ పూర్‌లో మరోసారి హైడ్రా అధికారుల కూల్చివేతలు ప్రారంభం కానున్నాయి. ఈ కూల్చివేతలు అమీన్ పూర్ పెద్ద చెరువు వద్ద అక్రమంగా నిర్మించిన నిర్మాణాలపై జరుగుతున్నాయి. పలు ఫిర్యాదుల ఆధారంగా విచారణ చేపట్టిన హైడ్రా అధికారులు, చెరువును ఆక్రమించుకొని నిర్మాణాలు చేయడాన్ని గుర్తించారు. అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు తేలిన వెంటనే, హైడ్రా కమిషనర్ కూల్చివేతకు ఆదేశాలు ఇచ్చారు. ఈ కూల్చివేతలు మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్నాయి. హైడ్రా అధికారులు ఈ కూల్చివేతల సమయంలో ప్రజల…
వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డిపై హైడ్రాలో ఫిర్యాదు నమోదైంది. అమీన్ పూర్‌లో 193 సర్వే నంబర్‌లోని తమ ల్యాండ్ కబ్జాకు గురైందని ఓ మహిళ హైడ్రాకు ఫిర్యాదు చేశారు. పాన్యం మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి, చిస్ట్లా రమేష్ కలిసి తమ ల్యాండ్ కబ్జా చేశారని తెలిపారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాంభూపాల్ రెడ్డి దౌర్జన్యాలు చేశారని, అందుకు సంభందించిన అన్ని ఆధారాలు హైడ్రాకు సమర్పించానని సదరు మహిళ చెప్పారు. తన ఫిర్యాదుపై హైడ్రా కమిషనర్ స్పందించి…
హైడ్రా కమిషనర్‌కు అమీన్‌పూర్ బాధితుల ఫిర్యాదు చేశారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ని కలిసిన అమీన్‌పూర్ బాధితులు.. మాధవరెడ్డి, చంద్రశేఖర్, కోటీశ్వరరావు అనే వ్యక్తుల దగ్గర ప్లాట్లు కొని మోసపోయామంటూ ఫిర్యాదు చేశారు.
HYDRA In Ameenpur: అమీన్పూర్ పెద్ద చెరువు పరిసర ప్రాంతాల్లో హైడ్రా, రెవెన్యూ అధికారులు సర్వే చేస్తున్నారు. హెచ్ఎంటీ, స్వర్ణపురి కాలనీలలోని సర్వే నెంబర్ 193, 194 & 323లలో రెవెన్యూ, పోలీస్ అధికారులతో కలిసి హైడ్రా సర్వే నిర్వహిస్తుంది.
ఇదిలా ఉంటే, అమెరికాలో సొంతగా కంపెనీ పెట్టలేకపోయాననే బాధతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అమీన్‌పూర్ పరిధిలో చోటు చేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూర్ మండలం ముత్యాల పల్లికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కాశీ విశ్వనాథ్(38) పటాన్చెరు పరిధిలోని అమీన్‌పూర్ దుర్గా హోమ్స్ కాలనీలో నివాసం ఉంటున్నాడు.