Srisailam Temple: ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో మరోసారి కలకలం రేగింది.. ఆలయ పరిసరాలలో చార్టర్ ఫ్లైట్ చక్కర్లు కొట్టింది.. శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో చార్టర్ ఫ్లైట్ తిరిగినట్టు స్థానికులు చెబుతున్నారు.. అయితే, నో ఫ్లై జోన్ గా ఉన్న శ్రీశైలం ఆలయ పరిసరాల్లో చార్టర్ ఫ్లైట్ చక్కర్లు కొట్టడంతో కలకలం రేగుతోంది.. గతంలోనూ శ్రీశైలం ఆలయం పరిసరాల్లో పలుమార్లు డ్రోన్‌లు ఎగిరాయి.. ఇక, తాజాగా, గత నెలలో ప్రధాన గోపురంపై ఓ డ్రోన్ చక్కర్లు కొట్టింది. దానికి లైటింగ్ కూడా ఉందని స్థానికులు తెలిపారు.. అర్థరాత్రి వేళ ఎగిరే పళ్లెం లాగా అది ఎగురుతూ ఉండటాన్ని ఆలయ సిబ్బంది చూశారు. అలర్ట్ అయ్యారు. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది దాన్ని కూల్చేద్దామని ప్రయత్నించారు.. కానీ, అది సాధ్యపడలేదు. కాసేపు ఎగిరిన తర్వాత ఆ డ్రోన్ దూరంగా వెళ్లిపోయింది. ఇంతవరకు ఆ డ్రోన్ ఆచూకీ లభ్యం కాలేదు.. అయితే, మరోసారి చార్టర్ ఫ్లైట్ ఆలయం చుట్టూ చక్కర్లు కొట్టడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చార్టర్ ఫ్లైట్‌లు ఎవరు ఉన్నారు? ఏదైనా కుట్ర కోణం ఉందా? లేదా పర్యాటకులు ఏమైనా వచ్చారా? లాంటి విషయాలు తేలాల్సి ఉంది.
Read Also: Somu Veerraju: హిందువుల మనోభావాలను దెబ్బ తీయడమే ప్రభుత్వం పనిగా పెట్టుకుంది..!