Somu Veerraju: హిందువుల మనోభావాలను దెబ్బ తీయడమే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్ ప్రభుత్వం పనిగా పెట్టుకుందని విమర్శించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ కార్యదర్శి సోమువీర్రాజు.. గుంటూరులో అగ్రహారం పేరు రాత్రికి రాత్రి ఫాతిమా పేరుతో బోర్డు పెట్టడంలో ఈ ప్రభుత్వం ఉద్దేశం ఏమిటి..? అని మండిపడ్డారు.. విశాఖ నగరంలో సీతమ్మ కొండ పేరు మార్చడం, ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టాలని ప్రయత్నం.. ఈ తరహా సంఘటనలకు ఎవరు సూత్రధారి..? అంటూ నిలదీశారు.. ముస్లింల కోసం చట్టాలు మారుస్తామని ప్రకటిస్తున్నారు.. హిందూ ఎస్సీలకు వ్యతిరేకంగా ప్రభుత్వ పోకడలు ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. హిందువులపై దాడులకు తెగబడే విధంగా వైసీపీ వ్యవహరిస్తోందని ఆరోపించారు సోము వీర్రాజు.
Read Also: Cyber Crime: మహిళలే టార్గెట్.. రోజుకు రూ.5 కోట్ల పైనే దోచేశాడు..!
కాగా, గుంటూరు కార్పొరేషన్ అధికారుల నిర్వాకంతో రెండు మతాలకు చెందిన వారి మధ్య చిచ్చుపెట్టేలా తయారైంది పరిస్థితి.. స్వచ్ఛ సర్వేక్షన్ లో భాగంగా వీధులకు బోర్డులు ఏర్పాటు చేసేందుకు రాజమండ్రికి చెందిన ఓ కంపెనీకి కాంట్రాక్టు తీసుకుంది.. కనీస సిబ్బంది పర్యవేక్షణ లేకుండానే గుంటూరులో ఎక్కడపడితే అక్కడ ఇష్టం వచ్చిన పేర్లతో బోర్డులు ఏర్పాటు చేయించారు అధికారులు.. అయితే, బోర్డులు చూసి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. మతాల మధ్య చిచ్చుపెట్టే విధంగా మున్సిపల్ అధికారుల చర్యలు ఉండటంతో అభ్యంతరం తెలుపుతున్నారు.. ఇక, బోర్డుల వ్యవహారంలో సీరియస్ గా స్పందించిన కార్పొరేషన్ పాలకవర్గం.. వెంటనే బోర్డులు తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.. దీంతో.. వివాదాస్పద బోర్డులను తొలగిస్తున్నారు కార్పొరేషన్ అధికారులు.