ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పోలీస్ బాస్ ఎంపికపై కసరత్తు ప్రారంభించింది.. డీజీపీ ఎంపిక కోసం ఐదుగురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లు కేంద్రానికి పంపింది ఏపీ ప్రభుత్వం.. సీనియర్ ఐపీఎస్ అధికారులైన మాదిరెడ్డి ప్రతాప్.. రాజేంద్ర నాథ్‌రెడ్డి.. హరీష్ కుమార్ గుప్తా.. కుమార్ విశ్వజిత్.. సుబ్రహ్మణ్యం పేర్లు కేంద్రానికి పంపించింది ఏపీ సర్కార్..
కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కటైపోయి స్టీల్ ప్లాంట్ లో 4వేల మంది కార్మికులను తొలగించటానికి సిద్ధం అవుతున్నాయని ఎమ్మెల్సీ బోత్స సత్యనారాయణ అన్నారు. ఏ ఒక్కరినీ తొలగించటానికి అడుగులు వెయ్యొద్దని డిమాండ్ చేశారు.
బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ నితిన్ అగర్వాల్, డిప్యూటీ స్పెషల్ డైరెక్టర్ జనరల్ వైబి ఖురానియాలను కేంద్రం శుక్రవారం తొలగించింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. అగర్వాల్ 1989 బ్యాచ్ కేరళ క్యాడర్ అధికారి కాగా, ఖురానియా 1990 బ్యాచ్ ఒడిశా క్యాడర్ అధికారి. అగర్వాల్ గతేడాది జూన్‌లో బీఎస్‌ఎఫ్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. పాకిస్తాన్ స్పెషల్ డైరెక్టర్ జనరల్ (పశ్చిమ)గా ఖురానియా బాధ్యతలు స్వీకరించారు.
Minister Seethakka: అల్లూరి విగ్రహ ఏర్పాటు కోసం కేంద్రం మీద ఒత్తిడి తెచ్చేలా తెలుగు రాష్ట్రాల ఎంపీలు కృషి చేయాలని మంత్రి సీతక్క తెలిపారు. ట్యాంక్ బండ్ మీద జరుగుతున్న అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో సీతక్క పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా ఆలుగునూర్లో మానకొండూర్ నియోజకవర్గ బూత్ సభ్యుల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో బీఆర్ఎస్ ఎంపీలు లేకపోతే జూన్ 2 తరువాత హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేసే ప్రమాదముందని తెలిపారు. మాకు మూడో వంతు మెజారిటీ ఇవ్వండి రిజర్వేషన్లు ఎత్తేస్తం అని బీజేపీ వాళ్ళు అంటున్నారని పేర్కొన్నారు. ఎంపీగా పని చేసిన బండి సంజయ్ పార్లమెంట్ పరిధిలో చేసిన అభివృద్ధి చెప్పి ఓట్లు అడగాలని…
నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని సెలవు ప్రకటించకపోవడంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రామమందిరంలో బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు ఒక పూట సెలవు ప్రకటించడాన్ని ప్రస్తావించిన దీదీ.. "రాజకీయ ప్రచారం" కోసం సెలవులు మంజూరు చేశారని విమర్శించారు.
వేర్పాటువాద నాయకుడు మస్రత్ ఆలం భట్ నేతృత్వంలోని జమ్మూ కాశ్మీర్ ముస్లిం లీగ్ ను కేంద్రం బుధవారం 'చట్టవిరుద్ధమైన సంఘం'గా ప్రకటించింది. అంతేకాకుండా.. UAPA చట్టం కింద ఐదేళ్లపాటు నిషేధించింది. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. 'ముస్లిం లీగ్ జమ్మూ కాశ్మీర్ (మస్రత్ ఆలం వర్గం)'/MLJK-MA UAPA కింద 'చట్టవిరుద్ధమైన సంఘం'గా ప్రకటించబడిందని తన పోస్ట్‌లో రాశాడు. భారత దేశం యొక్క ఐక్యత, సార్వభౌమాధికారం, సమగ్రతకు వ్యతిరేకంగా పనిచేసే ఎవరైనా…
2023 సంవత్సరానికి గానూ నేషనల్ స్పోర్ట్స్ అవార్డులు ప్రకటించింది కేంద్రం. ఇండియాలో క్రీడా రంగంలో అతిపెద్ద పురస్కారం 'ఖేల్ రత్న'కు ఇద్దరు బ్యాడ్మింటన్ క్రీడాకారులు ఎంపికయ్యారు. సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ చంద్రశేఖర్ శెట్టికి ఈ అవార్డును ప్రకటించారు. ఇక.. 26 మందికి అర్జున అవార్డ్స్ ను ప్రకటించింది కేంద్రం. అందులో క్రికెటర్ మహమ్మద్ షమీకి అర్జున అవార్డు లభించింది. ఈ జాబితాలో పారా ఆర్చర్ శీతల్ దేవి పేరు కూడా ఉంది. అంతేకాకుండా.. ఏపీకి చెందిన టీమిండియా…
“సమ్మక్క సారక్క” సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో.. ములుగు జిల్లాలో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు కానుంది. అంతకుముందు.. ఈ యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన బిల్లును సోమవారం కేంద్రం లోక్ సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. రూ. 889.07 కోట్లతో వర్సిటీని నెలకొల్పనున్నారు. ఈ వర్సిటీ ఏర్పాటుకు అక్టోబర్ లో జరిగిన కేబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది. ములుగు సమీపంలో 200 ఎకరాల…
కేరళ ఆర్థిక సంక్షోభానికి కారణం మీరంటే మీరేనని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వమే కారణమని.. ప్రభుత్వం వృథా ఖర్చులు చేస్తుందని కేంద్ర ప్రభుత్వం ఆరోపించింది. మరోవైపు రాష్ట్ర ఆర్థిక సంక్షోభానికి కేంద్ర విధానాలే కారణమని కేరళ ప్రభుత్వం ఆరోపిస్తుంది.