SVC59 :రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ “ఫ్యామిలీ స్టార్”.. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ పరుశురాం తెరకెక్కించారు. అలాగే స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మించారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. దీనితో ఈ సినిమా కలెక్షన్స్ పై ప్రభావం పడింది. అయితే ఫ్యామిలీ స్టార్ మూవీ సమయంలోనే హిట్, ప్లాప్ తో సంబంధం లేకుండా విజయ్ తో మరో సినిమా చేస్తాను అని దిల్ రాజు తెలిపారు. చెప్పినట్లుగానే రీసెంట్ గా ఈ సినిమాను మొదలు పెట్టారు.
ఈ సినిమాకు శ్రీకారం ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు.విజయ్ బర్త్ డే సందర్బంగా ఇటీవల ఈ సినిమా నుంచి మేకర్స్ ఓ పోస్టర్ రిలీజ్ చేసారు. గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సాయిపల్లవి విజయ్ సరసన హీరోయిన్ గా నటించనున్నట్లు సమాచారం.ప్రస్తుతం ఈ భామ తెలుగులో నాగచైతన్య సరసన ‘తండేల్’ సినిమాలో నటిస్తున్నది.ఇప్పుడు విజయ్ దేవరకొండ మూవీ ఆఫర్ దక్కించుకున్నట్లు సమాచారం. త్వరలోనే మేకర్స్ ఈ విషయంపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.