YS Jagan: కడప జిల్లాలో రెండో రోజు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. నియోజక వర్గంలో ప్రజలను కలుస్తూ వారి సమస్యలు తెలుసుకున్నారు. అలాగే, బ్రాహ్మణపల్లెలో అరటి తోటలను పరిశీలించిన అనంతరం అరటికి మద్దతు ధర లేక ఇబ్బందులు పడుతున్న రైతులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. పంటల కోసం పెట్టిన పెట్టుబడులు కూడా రాకపోవడంపై రైతుల్లో ఆందోళన నెలకొంది.. గత ప్రభుత్వ హయాంలో అరటి సాగులో కేంద్రం నుంచి అవార్డు తీసుకున్న రాష్ట్రం మనది.. అలాంటి పరిస్థితి నుంచి రాష్ట్రంలో రైతన్నల పరిస్థితి ఎందుకు ఇంతలా దిగజారింది.. 18 నెలల చంద్రబాబు హయాంలో 16 సార్లు రకరకాల విపత్తులు సంభవించాయని మాజీ సీఎం జగన్ పేర్కొన్నారు.
Read Also: Deputy CM Pawan: ఓట్ల కోసం ఇక్కడికి రాలేదు.. కోనసీమ రైతాంగం గళం అవుతా!
ఇక, చంద్రబాబు హయాంలో ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చింది సున్నా.. ఒక్కసారైనా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారా? అని వైఎస్ జగన్ తెలిపారు. ఏ రైతుకు కూడా 16 సార్లు విపత్తు సంభవించినా ఇన్సూరెన్స్ లేదు.. వైసీపీ ప్రభుత్వం ఇన్సూరెన్స్ ద్వారా రైతును ఆదుకునే పరిస్థితి ఉండేది.. సబ్సిడీ విత్తనాలు లేవు. ఎరువులు బ్లాక్లో కొనుగోలు చేయాల్సి వచ్చింది.. తొలిసారి రైతులు యూరియాను బ్లాక్లో కొనగోలు చేయాల్సి వచ్చింది.. వైసీపీ హయాంలో రైతు భరోసా ద్వారా కష్టకాలంలో ఉన్న రైతన్నను ఆదుకున్నాం.. చంద్రబాబు ప్రభుత్వం అన్నదాత సుఖీభవలో ఇవ్వాల్సిన మొత్తం నిలిపివేశారని జగన్ మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Read Also: Team India: టీమిండియాకు గాయాల బెడద.. స్టార్ ఆటగాళ్ల జాబితా పెద్దదే!
అయితే, కూటమి ప్రభుత్వంలో అరటి పంటకు నష్టం వాటిల్లితే పట్టించుకునే నాథుడు లేదు.. గతంలో ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేసి రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చేశాం.. అరటి మాత్రమే కాదు, మిర్చీ, పొగాకు, చీని, పసుపు ఇలా ప్రతీ పంటకు గిట్టుబాటు ధర లేదు.. చంద్రబాబు మనిషే కాదు.. చంద్రబాబుకు రైతుల ఉసురు తగులుతోంది.. త్వరలోనే చంద్రబాబు ప్రభుత్వం బంగాళాఖాతంలో కలుస్తుంది అని జగన్ అన్నారు.