Deputy CM Pawan: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఈ సందర్భంగా కేశనపల్లిలో సముద్ర జలాలతో దెబ్బ తిన్న లక్షలాది కొబ్బరి చెట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరాలు ఇవ్వడానికి నేను సీఎం కాదు.. ఆయన దృష్టికి తీసుకుని వెళ్తాం.. డిసెంబర్ రెండో వారంలో మళ్ళీ వస్తాను.. కోనసీమ డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణ మీద బీసీ రోశయ్య ఇచ్చిన నివేదిక ఆధారంగా అధికారులు స్టడీ చేసి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. అలాగే, కోకొనట్ బోర్డ్ ఏర్పాటు మీద క్యాబినెట్ లో చర్చిస్తాను అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
Read Also: Hyderabad: ప్రేమించి మోసం చేసిన యువతి.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సూసైడ్..
అయితే, కోనసీమ కొబ్బరిని పరిరక్షించుకోవాలి అని పవన్ కళ్యాణ్ తెలిపారు. గత ప్రభుత్వంలో అభివృద్ధి మరచిపోయారు.. ఓట్లు కోసం ఇక్కడికి రాలేదు.. హడావుడి చేయడానికి ఇక్కడికి రాలేదన్నారు. కోనసీమ రైతాంగం గళం అవుతాను అన్నారు. సర్వీస్ రూల్స్ లేకుండా సచివాలయం ఉద్యోగులు విషయంలో గత ప్రభుత్వంలో ప్రవర్తించింది.. ప్రజలను మభ్య పెట్టడానికి నేను రాలేదు అని చెప్పారు.. అవసరమైతే సినిమా చేసి మా సమస్య పరిష్కారం చేయాలన్నారు కొబ్బరి రైతులు.. గత సీఎంలా తన దగ్గర డబ్బులు లేవన్నారు పవన్.. కోనసీమ కొబ్బరి రైతులకి శాశ్వత పరిష్కారం కావాలి.. మూలాలు తెలుసుకోవాలి.. కొబ్బరి చెట్టు ఇంటికి పెద్ద కొడుకు లాంటిది అని డిప్యూటీ సీఎం పవన్ చెప్పుకొచ్చారు.