Chandrababu Bail Cancellation Petition: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్.. విచారణ వచ్చే నెలకు వాయిదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu Bail Cancellation Petition: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ వచ్చే నెలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు.. ఏప్రిల్ 16వ తేదీన ఈ పిటిషన్‌పై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టనున్నట్టు జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం పేర్కొంది.. కాగా, చంద్రబాబు కుటుంబం అధికారులను బెదిరిస్తోందని, వెంటనే బెయిల్ రద్దు చేయాలని గత వాదనల సందర్భంగా సుప్రీంకోర్టును కోరారు ప్రభుత్వం తరపు న్యాయవాదులు. అందుకు సంబంధించిన వివరాలతో ఇంటర్‌లొకేటరీ అప్లికేషన్ దాఖలు చేసినట్లు జస్టిస్ బేలాఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనంకు తెలిపారు న్యాయవాదులు. ప్రభుత్వం దాఖలు చేసిన ఐఏపై సమాధానం ఇవ్వాలనుకుంటున్నట్లు కోర్టుకు తెలిపారు చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్ సాల్వే.. దీంతో.. తదుపరి విచారణ మూడు వారాల పాటు వాయిదా పడగా.. ఆ వాయిదా ప్రకారం ఈ రోజు విచారణ జరగగా.. మళ్లీ 16వ తేదీకి వాయిదా పడింది.
Read Also: Narendra Modi: కేరళలోనూ కమలం వికసిస్తుందంటున్న మోడీ..!
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
అయితే, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ హైకోర్టు.. చంద్రబాబుకి ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ సీఐడీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.. స్కిల్ కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్ట్ చేయగా.. ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో 50 రోజులకు పైగా రిమాండ్‌లో ఉన్నారు.. ముందు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు.. ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన విషయం విదితమే.. దీంతో. స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టు మెట్లు ఎక్కింది.. ఆ పిటిషన్‌పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ జరిగింది. ఈ సందర్భంగా బెయిల్ రద్దుపై ఏప్రిల్ 16న పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని ధర్మాసనం పేర్కొంటి.. విచారణను వాయిదా వేసింది.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!