భారత ఎన్నికల సంఘం విడుదల చేసిన ఎన్నికల నోటిఫికేషన్ మేరకు అన్ని పార్టీలు పెద్ద ఎత్తున ప్రజలను ప్రభావితం చేసేలా సభలను నిర్వహిస్తున్నారు. ఇక దేశవ్యాప్త పార్లమెంట్ ఎన్నికలు జరుగుతుండగా.. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచార సభలను నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నాయి. గత రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా కేరళ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తికాలకు వెళ్తే..
Also Read: Hariah Rao: రైతులకు రూ.10వేలు ఇవ్వండి.. ప్రభుత్వానికి హరీష్ రావు డిమాండ్
కేరళ లోని పాలక్కడ్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో భాగంగా ప్రధాని పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. కేరళలో కమలం వికసిస్తుందని ఆయన అన్నారు. నేడు ఉదయం 10:45 గంటలకు పాలక్కడ్ లో ప్రారంభమైన ర్యాలీలో సౌత్ కేరళ నియోజకవర్గాలలో పోటీ చేస్తున్న ఎన్డీఏ అభ్యర్థులకు ఆయన మద్దతు ఇచ్చారు. కేరళ రాష్ట్ర ప్రజలు ఇన్నాల్లు కష్టాలను చవిచూశారని అంటూనే.. అవినీతి, అసమర్థతలో రాష్ట్ర ప్రభుత్వం మునిగిపోయిందని ప్రధాని మండిపడ్డారు.
Also Read: PSL 2024: మ్యాచ్ మధ్యలో ఆ పని చేసిన పాకిస్తాన్ క్రికెటర్.. వీడియో వైరల్!
ప్రస్తుతం కేరళలో పోటీ పడే ఎల్‌డీఎఫ్, యూడిఎఫ్ లు ఢిల్లీలో ఒక్కటయ్యాయని., ఈ పార్టీలు కేరళ ప్రజలను మోసం చేశాయని విమర్శించారు. ఈ సంవత్సరం మొదలు ప్రధాని మోడీ.. అనేక సార్లు దక్షిణాది రాష్ట్రాలను సందర్శించారు. ఇందులో భాగంగా కేరళ లోని ప్రముఖ దేవాలయాలనూ ఆయన సందర్శించిన సంగతి తెలిసిందే. ఈ ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు పచ్చి అబద్ధాలు మాత్రమే చెప్తారని ఆరోపణలు చేశారు.