Germany plane crash: ఇంటి పైకప్పుపై కూలిన విమానం.. ఇద్దరు మృతి
- జర్మనీలో శనివారం విషాదకర విమాన ప్రమాదం
- ఇద్దరు వ్యక్తులు మృతి
- విమానం ఎందుకు అదుపు తప్పిందనే అంశంపై అన్ని కోణాల్లో దర్యాప్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వాయువ్య జర్మనీలో శనివారం విషాదకర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఓ చిన్న ప్రైవేట్ విమానం నివాస ప్రాంతంలోని ఇంటి పైకప్పుపై కూలిపోవడంతో విమానంలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. పోలీసుల వివరాల ప్రకారం, ఈ ప్రమాదం ఓల్డెన్‌బర్గ్ సమీపంలోని గాండర్క్సీ (Ganderkesee) ప్రాంతంలో జరిగింది. విమానం అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయి నివాస ప్రాంతంలోకి దూసుకెళ్లి ఒక ఇంటి పైకప్పును ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
విమానంలో ప్రయాణిస్తున్న ఇద్దరూ బ్రెమెన్కు చెందినవారని అధికారులు తెలిపారు. మృతుల వయస్సులు 65, 77 సంవత్సరాలు. తొలుత ఒకరు మరణించగా, మరొకరు కనిపించకుండా పోయినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం శిథిలాలను తొలగించి విస్తృతంగా గాలించిన తర్వాత రెండో వ్యక్తి మృతదేహాన్ని కూడా గుర్తించారు. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న వారికి ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు జర్మన్ విమానయాన దర్యాప్తు అధికారులు విచారణ ప్రారంభించారు. విమానం ఎందుకు అదుపు తప్పిందనే అంశంపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.
Also Read
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
- El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
- Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
- US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
తాజావార్తలు
-
NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
-
Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
-
Ind Vs WI: శివాలెత్తిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం.. మూడు సెంచరీలు నమోదు..
-
Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
-
Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!