YSR Kalyanamasthu: కొన్ని ఇబ్బందులున్నా సంక్షేమ పథకాల అమలు విషయంలో ముందుకు సాగుతూనే ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఈ రోజు వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా ఆర్థిక సాయాన్ని విడుదల చేయనున్నారు సీఎం జగన్.. ఈ ఏడాది జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో పెళ్లిళ్లు చేసుకున్న అర్హులైన 10,511 జంటలకు వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా కింద రూ. 81.64 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించనుంది ఏపీ సర్కార్.. ఈ రోజు తన క్యాంపు కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో బటన్ నొక్కి వధువుల తల్లుల ఖాతాల్లో ఆ సొమ్మును జమ చేయనున్నారు సీఎం వైఎస్ జగన్..
Read Also: Sandeep Reddy Vanga: ఇదెక్కడి మాస్ వార్నింగ్ అన్న…
ఇవాళ వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా ఆర్ధిక సహాయం లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు.. జూలై- అక్టోబర్, 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 10,511 జంటలకు లబ్ధి చేకూరనుండగా.. 81.64 కోట్ల రూపాయలను వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తారు.. అయితే, ఇప్పటి వరకు ఈ పథకం కింద వైఎస్ జగన్ సర్కార్ అందించిన మొత్తం సాయం 349 కోట్ల రూపాయలు కాగా.. 46 వేల మందికి లబ్ధి పొందారు.. అయితే, పేదల పిల్లలు పెద్ద చదువులు చదవాలన్న ఆలోచనతో వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫాలకు అర్హతలు నిర్ణయించింది సర్కార్.. వధూవరులిద్దరు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.. బాల్య వివాహాల నివారణకు పెళ్లి నాటికి అమ్మాయికి 18, అబ్బాయికి 21 సంవత్సరాలు దాటి ఉండాలన్న నిబంధన పెట్టిన విషయం విదితమే..