Israel - Hamas: కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత ఇజ్రాయెల్- హమాస్‌లు తమ అధీనంలో ఉన్న బందీలను దశల వారిగా విడుదల చేస్తున్నారు. తమ చెరలోని బందీలుగా ముగ్గురిని హమాస్ రిలీజ్ చేయగా.. ఇజ్రాయెల్ కూడా 90 మంది పాలస్తీనా ఖైదీలను విడిచి పెట్టింది.
హమాస్‌పై ఇజ్రాయెల్ యుద్ధం నేటికీ కొనసాగుతోంది. ఈ యుద్ధం ముగింపు దశకు వచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి. గాజాలో తొమ్మిది నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికే లక్ష్యంతో హమాస్ యూఎస్ ప్రతిపాదించిన ఒప్పందాన్ని అమలు చేసేందుకు అంగీకరించిందని శనివారం వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది.