Drugs Case: డ్రగ్స్ అరికట్టేందుకు పోలీసులు ఎంత ప్రయత్నించినా సాధ్యం కావడం లేదు. ఈరోజు గచ్చిబౌలిలో డ్రగ్స్ కలకలం రేగింది. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో డ్రగ్స్ తీసుకున్న కొందరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. యువకులందరూ రాడిసన్ హోటల్‌లో ఘనంగా పార్టీ చేసుకున్నారు. వీరిలో ప్రముఖ బీజేపీ నేత కుమారుడు, వ్యాపారవేత్త కుమారుడు కూడా ఉన్నారు. ఈ పార్టీలో డ్రగ్స్, మద్యం ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. పక్కా సమాచారంతో పోలీసులు రాడిసన్ హోటల్‌పై దాడి చేశారు. అక్కడ యువకులు పెద్ద ఎత్తున డ్రగ్స్ తీసుకున్నారు. డ్రగ్స్ తీసుకున్న ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పెద్ద మొత్తంలో కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురు మూడు రోజులుగా పార్టీలు చేసుకుంటున్నట్లు సమాచారం. ముగ్గురు యువకులను పోలీసులు విచారిస్తున్నారు. కాగా.. అరెస్టయిన వారిలో ప్రముఖ వ్యాపారవేత్త, బీజేపీ నేత కుమారుడు కూడా ఉన్నట్లు సమాచారం.
Read also: Kolusu Parthasarathy: నేడు టీడీపీ కండువా కప్పుకోనున్న వైసీపీ ఎమ్మెల్యే
గతంలో కూడా.. బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్‌లోని ఫుడ్ అండ్ మింక్ పబ్‌పై ఎక్సైజ్ శాఖ చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. రాడిసన్ హోటల్‌లో నిర్వహిస్తున్న పబ్ లైసెన్స్ రద్దు చేసింది. హోటల్‌కు సంబంధించి మద్యం లైసెన్స్‌ను కూడా రద్దు చేశారు. రాడిసన్ హోటల్‌లో 24 గంటల మద్యం సరఫరాకు అనుమతి తీసుకున్నారు. ఇందుకోసం 56 లక్షల రూపాయల పన్ను కూడా చెల్లించారు. ర్యాడిసన్ బ్లూ ప్లాజా హోటల్‌లోని పబ్‌తో పాటు 24 గంటల 2బీ బార్ లైసెన్స్‌ను ఎక్సైజ్ శాఖ రద్దు చేసి నిబంధనలకు విరుద్ధంగా పబ్‌లు నడిపితే సీజ్ చేస్తామని హెచ్చరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. రాడిసన్ హోటల్ బార్, పబ్ లైసెన్స్‌లు రద్దు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ నిబంధనలకు విరుద్ధంగా పబ్‌లో డ్రగ్స్ బయటపడిన నేపథ్యంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆదేశాల మేరకు ఎక్సైజ్ అధికారులు పబ్, బార్ లైసెన్స్‌లను రద్దు కూడా చేశారు. అయితే ఇప్పుడు మళ్లీ గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ లో డ్రగ్స్ పట్టుబడటంతో తీవ్ర కలకలం రేపుతుంది.
Medaram Jathara: నేడు మేడారం నుంచి 512 హుండీలు తరలింపు.. 29 నుంచి లెక్కింపు..