చైనా ఎలక్ట్రిక్ SUV తయారీదారు BYD త్వరలో భారత మార్కెట్లో కొత్త Sealion 7 ఎలక్ట్రిక్ SUVని విడుదల చేయనుంది. ఈ SUVని ఫిబ్రవరి 17, 2025న అధికారికంగా లాంచ్ చేయనుంది. కంపెనీ 2025 లో భారత్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలు ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ కారు 2025 ఆటో ఎక్స్పోలో ప్రదర్శించబడింది. ఆ తర్వాత 18 జనవరి 2025 నుండి బుకింగ్ ప్రారంభమయ్యాయి.
ఫీచర్లు:
BYD Sealion 7 ఎలక్ట్రిక్ SUVలో అనేక గొప్ప ఫీచర్లు అందించబడింది. ఇందులో 12 స్పీకర్ల సౌండ్ సిస్టమ్, వైర్లెస్ ఫోన్ ఛార్జర్, వాటర్ డ్రాప్ టెయిల్ లాంప్, వెహికల్ టు లోడ్, 15.6 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, నప్పా లెదర్ సీటు, 128 కలర్ యాంబియంట్ లైట్లు, పనోరమిక్ సన్రూఫ్, హెడ్-అప్ డిస్ప్లే వంటి అనేక ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి.
బ్యాటరీ&రేంజ్
Sealion 7లో 82.56 kWh సామర్థ్యంతో బ్యాటరీని అమర్చారు. ఈ కారు ప్రీమియం, పనితీరు వేరియంట్లలో మాత్రమే తీసుకురానున్నారు. ఈ వాహనంలో 390 kW శక్తిని, 690 Nm టార్క్ను అందించే పవర్ ఫుల్ మోటార్ ఉంటుంది. దీని మోటార్ కేవలం 4.5 సెకన్లలో 100 కిమీ/గంట వేగాన్ని చేరుకుంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 567 కిలోమీటర్లు దూరం ప్రయాణించవచ్చు.
ధర&బుకింగ్:
ఇప్పటికే 18 జనవరి 2025 నుండి బుకింగ్ ప్రారంభమైన BYD Sealion 7 ధరలను ఫిబ్రవరి 17, 2025న ప్రకటించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. మీరు ఇప్పుడే రూ.70,000కి బుక్ చేయవచ్చు. Sealion 7 ధర అంచనాలు ఇంకా తెలియదు.
పోటీ:
BYD Sealion 7 ప్రీమియం ఎలక్ట్రిక్ SUV విభాగంలోకి వస్తుంది. ఇది Hyundai Ioniq 5, Kia EV6, BMW iX7 వంటి ఎలక్ట్రిక్ SUVలతో పోటీపడుతుంది.