Tesla: ఎలాన్ మస్క్‌కు చెందిన ఎలక్ట్రిక్ కార్ల సంస్థ ‘‘టెస్లా’’ ఈ రోజు దేశంలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ముంబైలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో 4000 చదరపు అడుగుల విస్తీర్ణంలో టెస్లా కొత్త షోరూం ఓపెన్ కాబోతోంది. ఈ షోరూంలో చైనా నుంచి దిగుమతి చేసుకున్న మోడల్ Y క్రాస్‌ఓవర్‌లను ప్రదర్శించనున్నారు.
దేశంలో ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్ విభాగం గ్రాఫ్ వేగంగా పెరుగుతోంది. ఎలక్ట్రిక్ వాహనాలపై జనాలకు నమ్మకం పెరుగుతోంది. ఈ క్రమంలో.. ఎలక్ట్రిక్ వాహనాలను అధిక సంఖ్యలో కొనుగోలు చేస్తున్నారు. పెట్రోల్ కార్లతో పోలిస్తే.. ఎలక్ట్రిక్ కార్లు ప్రతి నెలా భారీ పొదుపును అందిస్తున్నాయి. దీంతో.. జనాలు ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు.
BYD సీలియన్ 7 ఎలక్ట్రిక్ SUV భారత మార్కెట్లో లాంచ్ చేశారు. 2025 ఫిబ్రవరి 17న BYD భారత మార్కెట్లో కొత్త ఎలక్ట్రిక్ SUV, సెడాన్ కార్లను విడుదల చేసింది. ఈ కారును భారత్ మొబిలిటీ 2025 నిర్వహించిన ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించారు. కాగా.. 2025 జనవరి18 నుండే ఈ వాహనానికి బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి.
చైనా ఎలక్ట్రిక్ SUV తయారీదారు BYD త్వరలో భారత మార్కెట్లో కొత్త Sealion 7 ఎలక్ట్రిక్ SUVని విడుదల చేయనుంది. ఈ SUVని ఫిబ్రవరి 17, 2025న అధికారికంగా లాంచ్ చేయనుంది. కంపెనీ 2025 లో భారత్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలు ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది.
జనవరి 2025లో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలలో నార్వే కొత్త రికార్డు సృష్టించింది. నార్వేలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) ప్రగతి ఎంతో ఆకర్షణీయంగా ఉంది. జనవరి నెలలో అమ్ముడైన కొత్త కార్లలో 96% కంటే ఎక్కువ EVలు ఉన్నాయి.
Maruti e Vitara : దేశంలోనే అత్యధిక కార్లను ఉత్పత్తి చేసే మారుతి సుజుకీ తన తొలి ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. మారుతి సుజుకి తన తొలి ఎలక్ట్రిక్ సెడాన్‌ను ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది.
దేశంలో రోజు రోజుకూ ఎలక్ట్రిక్ వాహనాలకు క్రేజ్ పెరుగుతోంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇప్పుడు అందరి చూపు ఈవీల వైపునకు మళ్లుతోంది. ఆకాశాన్నంటుతున్న పెట్రోల్, డీజిల్ ధరల వల్ల ఈవీ కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈవీ వాహనాల వినియోగానికి అందిస్తున్న ప్రోత్సాహంతో కంపెనీలు పెద్ద ఎత్తున ఈవీలను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. కాగా.. ప్రస్తుతం భారతీయ మార్కెట్‌లో రూ. 11 లక్షల లోపు ఎంజీ విండ్సర్ ఈవీ , టాటా టియాగో ఈవీ,…
దేశంలో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెరుగుతోంది. చమురు ధరలు భారీగా పెరుగుతుండటంతో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం గనణీయంగా వృద్ధి చెందుతోంది. టాటా నిక్సాన్, ఎంజీ మోటార్స్‌తో పాటు మరికొన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తున్నాయి. భారత్‌లో అతిపెద్ద కార్ల కంపెనీల్లో ఒకటైన మారుతి-సుజుకి సంస్థ తన ఫస్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని తయారు చేసే పనిలో నిమగ్నమైంది. మారుతీ సుజుకికి చెందిన విటారాకు మార్కెట్లో మంచి ఆదరణ ఉంది.
అతి తక్కువ కాలంలోనే భారత ఆటోమొబైల్ ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ కియా త్వరలో కొత్త ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. మీడియా నివేదికల ప్రకారం.. కంపెనీ ఎప్పుడు, ఏ విభాగంలో, ఏ EVని తీసుకురాగలదో తెలుసుకుందాం.
భారతీయ ఎలక్ట్రిక్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలు ఒక దాని తర్వాత ఒకటి రిలీజ్ అవుతున్నాయి. ఇవాళ్టి నుంచి ప్రముఖ ఆటో కంపెనీ టాటా మోటార్స్ దాని ప్రముఖ కారు టాటా పంచ్ యొక్క ఎలక్ట్రిక్ వెర్షన్‌ను విడుదల చేసింది.