Brahma Anandam trailer: ప్రభాస్ చేతుల మీదుగా ‘బ్రహ్మా ఆనందం’ ట్రైలర్ విడుదల
- ‘బ్రహ్మా ఆనందం’ ట్రైలర్ విడుదల
- ఫిబ్రవరి 14న మూవీ గ్రాండ్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మళ్ళీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద వంటి హ్యాట్రిక్ హిట్ల తరువాత స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి ‘బ్రహ్మా ఆనందం’ అనే చిత్రం ఫిబ్రవరి 14న రాబోతోంది. ఈ చిత్రంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత బ్రహ్మానందం, అతని కుమారుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీమతి సావిత్రి,శ్రీ ఉమేష్ కుమార్ సమర్పణలో రూపొందించిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు Rvs నిఖిల్ అద్భుతంగా తెరకెక్కించారు. విజయవంతమైన నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా ఈ సినిమాను భారీ ఎత్తున నిర్మించారు. సోమవారం ఈ సినిమా ట్రైలర్‌ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ విడుదల చేశారు.
ట్రైలర్‌ను గమనిస్తే.. ‘బ్రహ్మా ఆనందం’ ఓ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా అనే విషయం స్పష్టమవుతుంది. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన ఓ యువకుడు థియేటర్ ఆర్టిస్ట్ కావాలనుకుంటాడు. దీని కోసం అతనికి కొంత డబ్బు అవసరం అవుతుంది. ఆ క్రమంలో అతనికి ఓ ముసలి వ్యక్తి పరిచయమై, తన 6 ఏకరాల పొలం ఇచ్చేస్తానంటాడు. అయితే 10 రోజుల పాటు తన స్వార్థం కోసమే ఆలోచించకుండా పక్కనున్న వారి కోసం కూడా ఆలోచించాలనే కండీషన్ పెడతాడు సదరు ముసలి వ్యక్తి.. ఆ తర్వాత ఏం జరిగిందనేదే ‘బ్రహ్మా ఆనందం’ సినిమా.
Also Read
- BKU : ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ఇండస్ట్రీ హిట్ సినిమా 'బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
ఓ వైపు డబ్బులు అవసరముండి.. ముసలి వ్యక్తి చెప్పిన పనులు చేసే కుర్రాడి పాత్రలో రాజా గౌతమ్, .. అతన్ని ఇబ్బంది పెట్టే తాత పాత్రలో బ్రహ్మానందం ఒదిగిపోయారు. ఎమోషనల్ సన్నివేశాలతో పాటు ఎంటర్‌టైనింగ్ ఎలిమెంట్స్ జత చేసి.. చుట్టూ ఉన్న పాత్రలను ఆకట్టుకునేలా దర్శకుడు ఆర్.వి.ఎస్.నిఖిల్ తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంటోంది. వెన్నెల కిషోర్ తనదైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకునే ఫన్నీ రోల్‌లో మెప్పించనుంటే, సంపత్ క్యారెక్టరైజేషన్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఇక హీరో లైఫ్‌లో లవ్ ట్రాక్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. అన్నీ వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా సినిమా ఉంటుందని ట్రైలర్ చూస్తుంటేనే అర్థమవుతుంది. ఈ ట్రైలర్‌తో సినిమాపై ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్‌ను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లారు మేకర్స్.
బ్రహ్మా ఆనందం చిత్రాన్ని వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. పొలిమేర 2, కమిటీ కుర్రోళ్లు, క వంటి చిత్రాల తరువాత నంది వంశీ నందిపాటి ఈ మూవీని ఫ్యాన్సీ రేటుకు హక్కుల్ని చేజిక్కించుకున్నారు.
ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, సంపత్ రాజ్, రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో నటించారు. శాండిల్య పిసాపాటి సంగీతం సమకూర్చగా, మితేష్ పర్వతనేని కెమెరా మెన్‌గా, ప్రణీత్ కుమార్ ఎడిటర్‌గా పని చేశారు.
తాజావార్తలు
-
Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఫ్లైట్ దాడి వెనుక ఇరాన్ హస్తం..? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
-
Christa Pike Execution Fails: మరణశిక్షకు ముందు చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్.. రెండు ఇంజెక్షన్లు ఇచ్చినా..
-
AP Liquor Shops: మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పెంపు.. ఫీజులు, తేదీలు ఇవే
-
BKU : ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ఇండస్ట్రీ హిట్ సినిమా ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
-
BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?