టయోటా కంపెనీ ప్రపంచవ్యాప్తంగా కొత్త టయోటా హిలక్స్ 2025 ను ప్రవేశపెట్టారు. ఈ పికప్ ట్రక్ ప్రత్యేక ఫీచర్ ఏమిటంటే, ఇది ఎలక్ట్రిక్, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ టెక్నాలజీని కలిగి ఉంది. ICE ఇంజిన్ స్థానంలో బలమైన బాడీ-ఆన్-ఫ్రేమ్ ప్లాట్‌ఫామ్‌తో భర్తీ చేశారు. బలమైన బాడీ-ఆన్-ఫ్రేమ్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడిన ఇది అద్భుతమైన ఆఫ్-రోడ్ సామర్థ్యాలను, బ్రేక్, టార్క్ కంట్రోల్ ను ఆటోమేటిక్ గా సర్ ఫేస్ కు సర్దుబాటు చేసే మల్టీ టెర్రైన్ సిస్టమ్ ను కలిగి ఉంది.…
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా తన ప్రసిద్ధ సెడాన్ ఆడి A4 సిగ్నేచర్ ఎడిషన్ వెర్షన్‌ను విడుదల చేసింది. ఈ కొత్త ఎడిషన్ ప్రీమియం ఫీచర్లతో వస్తుంది. ఇది భారత్ లో రూ. 57.11 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు ప్రారంభించారు. ఇందులో 360 డిగ్రీల కెమెరాతో పార్క్ అసిస్ట్, కొత్త వుడ్ ఓక్ డెకరేటివ్ ఇన్లే (సహజ బూడిద రంగు ముగింపు), ప్రీమియం క్యాబిన్ ఫీల్, ఆడి రింగ్స్ ఎంట్రీ LED ల్యాంప్స్,…
హిందుస్థాన్ మోటార్స్ కంపెనీ తయారు చేసిన అంబాసిడర్ కార్ల ఉత్పత్తి 1957లో ప్రారంభమైంది. 990వ దశకం మధ్య వరకు దేశంలో అంబాసిడర్ కు ఉన్న క్రేజ్ వేరు. ఈ కారు అప్పట్లో భారతీయులకు ఒక స్టేటస్ సింబల్. భారత్‌లో ఏకైక సామూహిక లగ్జరీ కారు ఇది. 1991లో సరళీకరణ తర్వాత క్రమంగా అంబాసిడర్ కారు కనుమరుగైంది. కానీ 1980ల ప్రారంభంలో ఖర్చెక్కువ, మైలేజ్ తక్కువ కావడంతోపాటు నాసికరం అంబాసిడర్ కార్లను మార్కెట్‌లోకి విడుదల చేయడంతో అమ్మకాలు తగ్గిపోయాయి.…
టయోటా కిర్లోస్కర్ మోటార్ భారతదేశంలో తన ప్రసిద్ధ పికప్ హిలక్స్ యొక్క కొత్త బ్లాక్ ఎడిషన్ వేరియంట్‌ను విడుదల చేసింది. భారతదేశంలోని అన్ని టయోటా డీలర్‌షిప్‌లలో హిలక్స్ బ్లాక్ ఎడిషన్ బుకింగ్ ప్రారంభమయ్యాయి. దీని డెలివరీ మార్చి, 2025లో ప్రారంభమవుతుంది. భారత మార్కెట్లో హిలక్స్ బ్లాక్ ఎడిషన్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 37.90 లక్షలుగా ఉంచారు. నల్ల పులిలాగా కనిపించే ఈ కారు లుక్ అదిరిపోయింది. ఈ హిలక్స్ డిజైన్, ఫీచర్లు, పవర్‌ట్రెయిన్, ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం..
చైనా ఎలక్ట్రిక్ SUV తయారీదారు BYD త్వరలో భారత మార్కెట్లో కొత్త Sealion 7 ఎలక్ట్రిక్ SUVని విడుదల చేయనుంది. ఈ SUVని ఫిబ్రవరి 17, 2025న అధికారికంగా లాంచ్ చేయనుంది. కంపెనీ 2025 లో భారత్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలు ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది.
MG Astor : ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ ఎంజీ మోటార్స్ ఆస్టర్ లైనప్‌ను అప్ డేట్ చేసింది. ఈ కారులో పనోరమిక్ సన్‌రూఫ్ ఫీచర్‌ను కంపెనీ చేర్చింది. దీనితో పాటు కారులో 6 స్పీకర్ సిస్టమ్ ను కూడా ఏర్పాటు చేశారు.
Maruti e Vitara : దేశంలోనే అత్యధిక కార్లను ఉత్పత్తి చేసే మారుతి సుజుకీ తన తొలి ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. మారుతి సుజుకి తన తొలి ఎలక్ట్రిక్ సెడాన్‌ను ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది.