BYD Cars: చైనా కార్ల తయారీ సంస్థ బీవైడి (BYD) 2025 నాటికి భారత మార్కెట్లో తన రెండు ప్రముఖ ఎలక్ట్రిక్ కార్లు బీవైడి సీల్, బీవైడి అట్టో 3 మోడళ్లను అప్‌డేట్ చేసింది. ఈ కొత్త మోడళ్లలో కొన్ని అదనపు ఫీచర్లను అందించడంతో పాటు కొంత మెరుగైన సాంకేతికతను కూడా ఉపయోగించింది. బీవైడి సంస్థ భారత మార్కెట్లో కొంతకాలంగా తన అమ్మకాలను గణనీయంగా పెంచుకుంటోంది. ఇప్పటివరకు కంపెనీ 1300 యూనిట్ల బీవైడి సీల్ సెడాన్, 3100 యూనిట్ల బీవైడి అట్టో 3 ఎస్యూవీ అమ్మకాలను నమోదు చేసింది.
Also Read: Governor Jishnu Dev Varma : మా ప్రభుత్వం సామాజిక న్యాయం సంక్షేమానికి కట్టుబడి ఉంది
2025 బీవైడి సీల్:
నూతన మోడల్‌లో బీవైడి సీల్ కారులో కొన్ని కీలక మార్పులను కంపెనీ తీసుకొచ్చింది. బీవైడి ఇప్పుడు సీల్ మోడల్‌లో అన్ని వేరియంట్లకు పవర్డ్ సన్‌షేడ్‌ను అందిస్తోంది. ఎండలో ఎక్కువసేపు డ్రైవింగ్ చేసే వారికి ఇది చాలా ఉపయోగకరంగా మారనుంది ఎందుకంటే ఇది క్యాబిన్ వేడెక్కకుండా కాపాడుతుంది. ఈ ఎలక్ట్రిక్ సెడాన్‌లో ఇప్పుడు వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ ప్రామాణికంగా అందించబడింది. ఈ కారులో ఇప్పుడు మరింత శక్తివంతమైన ఎయిర్ ప్యూరిఫైయింగ్ సిస్టమ్‌ను అందించడం జరిగింది. తద్వారా క్యాబిన్ గాలి మరింత శుభ్రంగా ఉండేలా ఉంటుంది.
బీవైడి సీల్ కారు సంబంధించి మిడ్ స్పెక్ ప్రీమియం వేరియంట్‌లో ఇప్పుడు ఎఫ్ఎస్డి డంపర్స్ అందించబడతాయి. గతంలో ఇది టాప్ ఎండ్ పెర్ఫార్మెన్స్ వేరియంట్‌కు మాత్రమే పరిమితం చేయబడింది. ఈ టాప్ వేరియంట్‌లో బీవైడి తన కొత్త డిఐసస్సీ డంపింగ్ సిస్టమ్‌ను జోడించింది. ఇది కఠినమైన రోడ్లపై సస్పెన్షన్‌ను మృదువుగా చేయగలదు. ఇంకా కార్నరింగ్ యాక్సిలరేషన్ బ్రేకింగ్ సమయంలో స్టెబిలిటీని మెరుగుపరుస్తుంది. 2025 బీవైడి సీల్‌ను ఒక 1,25,000 టోకెన్ మొత్తంతో మార్చి 11 నుంచి బుక్ చేసుకోవచ్చు. అయితే దీని అధికారిక ధర ఏప్రిల్ నెలలో ప్రకటించనున్నారు.
Also Read: KCR : అసెంబ్లీకి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్..
2025 బీవైడి అట్టో 3:
బీవైడి తన అట్టో 3 ఎస్యూవీ మోడల్‌ను కూడా నవీకరించింది. కొత్త మోడల్లో మరింత అధునాతన ఫీచర్లు అందించబడినాయి. ఈ కొత్త అట్టో 3 మోడల్లో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు అందించబడతాయి. ఇది ఎక్కువకాలం డ్రైవింగ్ చేసే వారికి చాలా హాయిగా ఉంటుంది. ఇంతకుముందు మూడు టోన్ల ఇంటీరియర్ అందుబాటులో ఉండగా ఇప్పుడు ఫుల్ బ్లాక్ ఇంటీరియర్ ఆప్షన్‌ను అందించారు. ఇంకా బీవైడి ఇప్పుడు లెడ్ యాసిడ్ బ్యాటరీల స్థానంలో కొత్త లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీను ఉపయోగిస్తోంది. వీటివల్ల సాంప్రదాయ తక్కువ వోల్టేజ్ బ్యాటరీల కంటే ఆరు రెట్లు తేలికపాటి, 15 సంవత్సరాల వరకు బ్యాటరీ జీవితకాలం ఉంటుంది.
తాజా మోడల్ మొదటి మూడు వేల యూనిట్లను కంపెనీ ప్రస్తుత ధరకు విక్రయిస్తోంది. BYD Atto 3 డైనమిక్ వేరియంట్ (49.92 kWh బ్యాటరీ) రూ. 24.99 లక్షలు, BYD Atto 3 ప్రీమియం వేరియంట్ (60.48 kWh బ్యాటరీ) రూ. 29.85 లక్షలు, BYD Atto 3 సుపీరియర్ వేరియంట్ రూ. 33.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ధరలు ఉన్నాయి. కొనుగోలు దారులు 30 వేల టోకెన్ మొత్తం చెల్లించి బీవైడి అట్టో 3 బుకింగ్ చేసుకోవచ్చు.