ఏపీలో మోడీ పర్యటనలో వైసీపీ నేతలు మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నించారు టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న. విజయసాయి రెడ్డిని అరెస్టు చేసి, నార్కో పరీక్షలు చేయాలి. రాష్ట్రంలో అవినీతి అనకొండలా పెరిగింది. సీఎం కొడుకుకి ఆడిటరుగా ఉన్న జగన్, విజయసాయి రెడ్డి లు రూ. 40 వేల కోట్లు దోచుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి రెట్టింపు స్థాయిలో ప్రజా ధనాన్ని దోచేశారు.ఎలా దోచుకోవాలో విజయసాయి రెడ్డికి తెలిసినట్లుగా ఎవరికీ తెలియదన్నారు. వైసీపీ చరిత్రలో రెండోసారి రాజ్యసభ ఇచ్చారంటే.. అతని అవినీతే అర్హత.
Read Also: TRS MLA Rasamayi Balakrishna: బ్రేకింగ్.. ఎమ్మెల్యే కాన్వాయ్ పై యువకుల దాడి
లిక్కర్ స్కాంలో విజయసాయి రెడ్డి అల్లుడి సోదరుడిని అరెస్టు చేశారు. దీనికి సూత్రధారి విజయసాయి రెడ్డి కాబట్టి నార్కో టెస్ట్ చేయించాలన్నారు. విజయసాయి రెడ్డిని ప్రధాని సభకు సమన్వయకర్తగా ఎలా వేశారు..?విజయసాయివి అన్నీ బ్రాకెట్ ఐడియాలే..ప్రధాని సభలో హడావుడి చేయకుండా నక్కి నక్కి చూస్తున్నారు. ఉత్తరాంధ్రలో రూ. 50 వేల కోట్లు దోచుకున్న వైనం కేంద్ర పెద్దలకి చెప్పి ఉంటారు. అందుకే సభ దగ్గర అతన్ని దూరంగా పెట్టారు.లిక్కర్ కేసులో విజయసాయి రెడ్డిని అరెస్టు చేసి విచారణ చేయాలి.
ట్విట్టర్లో నిత్యం మొరిగే విజయసాయి రెడ్డి లిక్కర్ స్కాం, ఉత్తరాంధ్ర భూకబ్జాలు, స్కాంలపై ఎందుకు మొరగడం లేదు..?జగనుకు, విజయ సాయికి అవినీతిలో వాటా ఉంది.అందుకే అతనికి రెండోసారి రాజ్యసభ ఇచ్చారు.కేంద్రం జోక్యం చేసుకుని విజయసాయి రెడ్డికి నార్కో పరీక్ష చేయించాలి.విజయసాయి అవినీతిపై ఈడీ కూడా ప్రత్యేక శ్రద్ద పెట్టాలి.రాష్ట్ర బీజేపీ నేతలు కూడా విజయసాయి రెడ్డి అవినీతిని కేంద్ర పెద్దలకు వివరించారు.నిజాలు రావాలంటే విజయసాయి రెడ్డిని అరెస్టు చేయాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు.
Read Also: Narayana: మోడీ వచ్చారు.. వెళ్ళారు.. తెలుగు రాష్ట్రాలకేం చేశారు?